అసమ్మతి నేతలకు సోనియా వార్నింగ్

Telugu Lo Computer
0

 

కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి సమావేశంలో అధినేత్రి సోనియా అసమ్మతి నేతల పైన సీరియస్ అయ్యారు. కొద్ది సేపటి క్రితం ఆరంభమైన ఈ సమావేశంలో సోనియా ముందుగా అసమ్మతి నేతల అంశం పైన స్పందించారు. పార్టీలోని ఏ అంశాలపైన అయినా చర్చకు సిద్దమని స్పష్టం చేశారు. తాను ఫుల్ టైం కాంగ్రెస్ అధ్యక్షురాలినని సోనియా తేల్చి చెప్పారు. 23 గ్రూప్‌గా రూపొందిన సీనియర్ లీడర్లు గులాంనబీ ఆజాద్‌, ఆనంద్ శర్మ వంటి అసమ్మతివాదులు పార్టీలో అంతర్గతంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీకి పూర్తిస్థాయి, శక్తిమంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలంటూ సోనియా గాంధీకి జీ23 గ్రూప్ నేతలు లేఖ రాశారు. అయితే, వారి పైన ఇప్పటి వరకు పార్టీ ఎటువంటి చర్యలకు ఉపక్రమించ లేదు. ఇప్పుడు ఈ సమావేశం ద్వారా సోనియా ఈ హెచ్చరికలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో మీడియాకు ఎక్కి పార్టీ ప్రతిష్ఠను తగ్గించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. సీడబ్ల్యూసీ భేటీ గురించి పార్టీ సీనియర్ నేత ఆజాద్ లేఖ కూడా రాసారు. ఇక, పలు కీలక అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)