బండ్ల గణేష్ నామినేషన్ ఉపసంహరణ

Telugu Lo Computer
0


నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరో షాక్ ఇచ్చారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు మద్దతునిస్తున్నానని కానీ జనరల్‌ సెక్రటరీ పోస్టుకు మాత్రం తాను పోటీలో ఉంటానని ఇంతకు ముందు ప్రకటించి ఆయన షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇండిపెండెంట్‌గా పోటీకి దిగుతున్నానంటూ ఆయన నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. అయితే తాజాగా తాను వేసిన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నట్టు బండ్ల గణేష్ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. ప్రకాశ్‌ రాజ్‌, శ్రీకాంత్‌లతో దిగిన ఫొటోను బండ్ల గణేష్ షేర్‌ చేస్తూ 'నా దైవ సమానులు.. నా ఆత్మీయులు.. నా శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను` అంటూ ట్వీట్‌ చేసి షాక్‌ ఇచ్చాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)