ఝున్‌ఝున్‌వాలా ఎయిర్‌లైన్స్‌కు గ్రీన్ సిగ్నల్‌!

Telugu Lo Computer
0


బిగ్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆధ్వర్యంలోని స్టార్టప్ ఎయిర్‌లైన్ ఆకాశకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఆయనకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) జారీ చేసింది. ఎయిర్ ఆపరేటర్ పర్మిట్ లైసెన్స్ కోసం సివిల్ ఏవియేసన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ)కు ఝున్‌ఝున్‌వాలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కంపెనీలో ఆయన 40 శాతం వాటా, 35 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెడుతున్నారు. ఆల్ట్రా లో కాస్ట్ విమానయాన సంస్థకు ఏవియేషన్ వెటరన్ వినయ్ దూబే సారధ్యం వహిస్తారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అకాశ సేవలు ప్రారంభించే అవకాశం ఉంది. ఇటీవలే ఢిల్లీలో ప్రధాని మోదీని ఝున్‌ఝున్‌వాలా కలుసుకున్నారు. ఈ విమానయాన సంస్థ 100 బోయింగ్ 737 మ్యాక్స్‌, ఎయిర్‌బస్‌కు చెందిన ఏ320 నియో ఫ్యామిలీ విమానాల కొనుగోలుకు ఆర్డర్ట్ చేసింది. అయితే, వీటికోసం చాలా కాలం వేచి ఉండాల్సి ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)