మాంచెస్టర్‌లో మహారాష్ట్ర కుర్చీ !

Telugu Lo Computer
0


జర్నలిస్ట్‌ సునందన్‌ లేలే ఇటీవల ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ సిటీని సందర్శించాడు. అక్కడ ఓ రెస్టారెంట్‌లోని ఓపెన్‌ సీటింగ్‌ ఏరియాలో ఉన్న కుర్చీ అతన్ని బాగా ఆకర్షించింది. ఇనుముతో ఉన్న కుర్చీ వెనక మరాఠీలో 'బాలు లోఖండే సవ్లాజ్‌' అని రాసి ఉంది. దీనిని చూసిన అతను ఆశ్యర్యపోయాడు. 'ఇది వింత కాదా' అంటూ తన ట్విటర్‌లో దీనికి సంబంధించిన వీడియో పోస్టు చేశారు. ఈ ఆసక్తికరమైన విషయాన్ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. కుర్చీ ప్రయాణాన్ని చూస్తుంటే భారతీయ మార్కెట్ విస్తరణ ఏ విధంగా ఉందో అర్థమవుతోందని, చాలామంది మరాఠీలుగా గర్వపడుతున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుర్చీ మహారాష్ట్రలోని సాల్వాజ్‌ గ్రామానికి చెందిన టెంట్‌హౌజ్‌ బాలు లోఖండేకు చెందినది. ఇటీవల ప్లాస్టిక్‌ కుర్చీలకు డిమాండ్‌ పెరగంతో టెంట్‌హౌజ్‌ యజమాని ప్లాస్టిక్ కుర్చీలను వాడుతుండటంతో లోఖాండే తన పాత ఇనుప కుర్చీలను 15 ఏళ్ల క్రితం పాత ఇనుప సామానులకు అమ్ముకోవాల్సి వచ్చింది. .అది కాస్తా మహారాష్ట్ర నుంచి 7,627 కిలోమీటర్ల దూరంలోని మాంచెస్టర్‌కు చేరి అక్కడ ఇలా దర్శనమిచ్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)