ఎయిర్‌టెల్‌ - రూ.6000 క్యాష్‎ బ్యాక్! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Friday, 8 October 2021

ఎయిర్‌టెల్‌ - రూ.6000 క్యాష్‎ బ్యాక్!

 

ప్రముఖ టెలికామ్ దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ బ్రాండ్ల నుంచి ₹12,000 వరకు ధర కలిగిన కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు భారతి ఎయిర్‌టెల్‌ ₹6,000 క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎయిర్‌టెల్ ఈ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ పొందాలనుకునే వినియోగదారులు కంపెనీ ఎంపిక చేసిన 150కి పైగా స్మార్ట్ ఫోన్లు ఏదైనా ఒకటి కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే, క్యాష్ బ్యాక్ బెనిఫిట్ పొందడం కోసం కస్టమర్ 36 నెలల పాటు నిరంతరం (ప్యాక్ వాలిడిటీ ప్రకారం) ₹249 లేదా అంతకంటే ఎక్కువ ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కస్టమర్ రెండు దశలలో క్యాష్ బ్యాక్ అందుకొనున్నారు. మొబైల్ కొన్న 18 నెలల తరువాత మొదటి విడత కింద ₹2000, మిగతా 4 వేల రూపాయలను 36 నెలల తర్వాత అందుకుంటారు. ఈ ప్రోగ్రామ్ కింద మొబైల్ కొనే కస్టమర్ల స్మార్ట్‌ఫోన్ కు ఏదైనా డ్యామేజీ జరిగినట్లయితే సెర్ విఫై ద్వారా ఒక్కసారి ఫ్రీ స్క్రీన్ రీప్లేస్ మెంట్ కు అర్హులు. దీనివల్ల అదనంగా ₹4800 వరకు ప్రయోజనం కలుగుతుంది. "స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు ప్రాథమిక అవసరం, ప్రత్యేకించి కరోనా మహమ్మారి అనంతర కాలంలో వినియోగదారులు డిజిటల్‌గా అనేక రకాల సేవలను యాక్సెస్ చేయాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా మిలియన్ల మంది కస్టమర్లు మంచి ఆన్‌లైన్ అనుభవం కోసం నాణ్యమైన స్మార్ట్‌ఫోన్ కోసం ఆకాంక్షిస్తుండగా, వారికి నచ్చిన పరికరాన్ని సులభంగా కలిగి ఉండాలనేది మా ఆశయం" అని మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ శాశ్వత్ శర్మ అన్నారు.

No comments:

Post a Comment

Post Top Ad