54వసారి బదిలీ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 23 October 2021

54వసారి బదిలీ !

 


నిజాయితీ కలిగిన అధికారులు బదిలీ వేటుకు గురవడం కొత్తేమి కాదు. బదిలీ అధికారుల వ్యక్తిత్వానికి ఒక్కోసారి కొలమానంగా ఉంటుంది. ఎక్కువ బదిలీలు సదరు అధికారిలోని నిజాయితీని లెక్కిస్తాయని కూడా అంటుంటారు. హర్యానా ప్రభుత్వం తాజాగా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని బదిలీ చేసింది. తన 29 ఏళ్ల సర్వీసులో ఆయనకు ఇది 54వ బదిలీ కావడం గమనార్హం. అశోక్ ఖేంకా అనే ఐఏఎస్ అధికారి హర్యాన ప్రభుత్వ అర్చీవ్స్, అర్కియాలజీ అండ్ మ్యూజియం డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా పని చేస్తున్నారు. కాగా, ఈయనను శనివారం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్స్ సెక్రటరీగా బదిలీ చేస్తూ హర్యానా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1991వ బ్యాచ్‌కు చెందిన ఈయనకు మంచి అధికారిగా పేరుంది. ఈయన నిజాయితీ వల్లె తన కెరియర్‌లో అన్ని బదిలీలు ఎదుర్కొంటున్నారని ఈయన సన్నిహితులు అంటున్నారు.

No comments:

Post a Comment