అసిస్టెంట్ కమాండెంట్స్‌గా 38 మంది వైద్యులు

Telugu Lo Computer
0

 



కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఢిల్లీలోని ప్రత్యేక కొవిడ్-19 ఆసుపత్రిలో సేవలు అందించిన 38 మంది వైద్యులను శనివారం ఇక్కడ లాంఛనప్రాయంగా నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌ తర్వాత అధికారికంగా ఇండియా-చైనా ఎల్ఏసీ గార్డింగ్ ఫోర్స్ అయిన ఐటీబీపీలో చేరారు. ఐటీబీపీలో చేరిన వైద్యులు 24 వారాల శిక్షణను పూర్తిచేశారని, ఇప్పుడు అసిస్టెంట్ కమాండెంట్ హోదాలో మెడికల్ ఆఫీసర్‌లుగా నియమితులైనట్టు ఐటీబీపీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ సంజయ్ అరోరా పారామిలిటరీ ఫోర్స్ అధికారుల శిక్షణ అకాడమీలో కవాతుకు వందనం స్వీకరించారు. 14 మంది మహిళా అధికారులు సహా వైద్యులు శనివారం అధికారికంగా దళంలో నియమితులయ్యారు. వీరు వ్యూహాలు, ఆయుధాల నిర్వహణ, ఇంటెలిజెన్స్ సేకరణ, ఫీల్డ్ ఇంజనీరింగ్, మ్యాప్ రీడింగ్, వివిధ లా సబ్జెక్టులు, మానవ హక్కులు వంటి అంశాలలో శిక్షణ పొందినట్లు ప్రతినిధి తెలిపారు. వైద్యులు తమ శిక్షణను పూర్తి చేయకముందు ఢిల్లీలోని సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్‌లో సేవలు అందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)