అక్టోబర్ 31 వరకు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ రెన్యువల్ లకు గడువు

Telugu Lo Computer
0


డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, వాహనాల అనుమతి రెన్యువల్(చెల్లుబాటు గడువు పొడగింపు) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ఈ డాక్యుమెంట్లను రెన్యువల్ చేసుకోవడానికి అక్టోబర్ 31వ తేదీ వరకు సమయం ఇచ్చింది. ఈ గడువు ఇకపై పొడిగించే అవకాశమే లేదని ప్రకటించింది. అక్టోబర్ 31వ తేదీ తర్వాత అసంపూర్తి డాక్యుమెంట్‌లతో డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడితే, జరిమానా భారీగా చెల్లించాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి కారణంగా, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్ సహా అవసరమైన పత్రాలను రెన్యువల్ చేసుకునేందుకు ప్రభుత్వం మినహాయింపు ఇస్తూ వచ్చింది. వాస్తవానికి వాహనాలకు సంబంధించిన పత్రాల గడువు ముగిసినా కూడా కరోనా కారణంగా ఫిబ్రవరి 2020 నుంచి ఇప్పటివరకు చెల్లుబాటు అయ్యేలా గతంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. కానీ 31 అక్టోబర్ 2021 తర్వాత అది గడువు ముగిసినట్లుగా స్పష్టం చేసింది రవాణాశాఖ.

Post a Comment

0Comments

Post a Comment (0)