23న ముఖ్యమంత్రి విశాఖ పర్యటన - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 21 October 2021

23న ముఖ్యమంత్రి విశాఖ పర్యటన


ఈనెల 23 వ తేదీన విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 23 వ తేదీ మధ్యాహ్నం 3:30 నిమిషాలకు ముఖ్యమంత్రి జగన్ తన నివాసం నుంచి బయలుదేరి 4:45 నిమిషాలకు విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. విశాఖలో పలు కార్యక్రమాలతో పాటు ఓ వివాహానికి హాజరవుతారు. ఎయిర్ పోర్ట్ నుంచి 5:20 నిమిషాలకు ఎన్ఏడి కి చేరుకొని అక్కడ నిర్మించిన ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్నారు. అనంతరం 5:55 నిమిషాలకు వుడా పార్కు వద్ద కు చేరుకొని వుడా పార్కు ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం తరువాత ఎం జి ఎం గ్రౌండ్స్ లో జరగనున్న చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. తిరిగి 7 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకొని తాడేపల్లి నివాసానికి వెళ్లనున్నారు.

No comments:

Post a Comment