ఫార్మా కంపెనీ సోదాలలో రూ.142 కోట్లు సీజ్‌ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Saturday, 9 October 2021

ఫార్మా కంపెనీ సోదాలలో రూ.142 కోట్లు సీజ్‌


హైదరాబాద్‌ నగరంలోని ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఐటీ శాఖ ఫార్మా సంస్థ లో సోదాలపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు సోదాల్లో 142.87కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. కంపెనీకి సంబంధించి మొత్తం 16 బ్యాంకు లాకర్లతో పాటు ఇప్పటి వరకు లెక్కల్లో చూపని 550 కోట్ల రూపాయల ఆదాయం గుర్తించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. కంపెనీకి సంబంధించి ఆరు రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ శాఖ తెలిపింది. సదరు ఫార్మా కంపెనీ యూరప్‌, అమెరికాకు డ్రగ్స్‌ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నట్లు ఐటీ శాఖ తెలిపింది. సంస్థకు సంబంధించిన ప్రదేశాల్లోని పలు రహస్య స్థావరాల్లో లెక్కలకు సంబంధించిన పుస్తకాలు, నగదు, ఖాతాలు, నగదుకు సంబంధించిన రెండవ సెట్ పుస్తకాలు కనుగొన్నట్లు ఐటీ శాఖ తెలిపింది. డిజిటల్ మీడియా, పెన్ డ్రైవ్‌లు, డాక్యుమెంట్ల రూపంలో నేరపూరితమైన సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీశాఖ వెల్లడించింది. బోగస్, ఉనికిలో లేని సంస్థల నుంచి చేసిన కొనుగోళ్లలో వ్యత్యాసాలు వంటి విషయాలు బయటపడినట్లు తెలిపింది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ కంటే తక్కువగా కొనుగోలు చేసిన భూముల వివరాలు, ఇతర అనేక విషయాలు బయటపడినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. 

No comments:

Post a Comment

Post Top Ad