భార్య ఆత్మహత్యను వీడియో తీసిన భర్త

Telugu Lo Computer
0


భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపాల్సింది పోయి దాన్ని వీడియో తీశాడు. అనంతరం ఆమె బంధువులకు ఆ వీడియోను వాట్సాప్‌లో పంపాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెంచలయ్య, కొండమ్మ దంపతులు. కొండమ్మ మెప్మాలో రిసోర్స్ పర్సన్‌గా పని చేస్తోంది. దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే కొండమ్మ తన భర్త ముందే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె భర్త పెంచలయ్య దాన్ని అపకుండా అదంతా వీడియో తీశాడు. అనంతరం వాట్సాప్‌లో ఆ కుటుంబ సభ్యులకు పంపాడు. దాంతో పెంచలయ్యపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. పోలీసులు పెంచలయ్యను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)