బాహుబలి కాదు; బతుకు లోగిలి !

Telugu Lo Computer
0

 

ఇది బాహుబలి దృశ్యం కాదు; బతుకు చిత్రం !

విశాఖ మన్యంలో రహదారులు, వంతెనలూ లేక

గిరిజనులు పడుతున్న ఇబ్బందులకు ప్రతిబింబం ...

ఆ పసిబిడ్డకు నాలుగు రోజులుగా  తీవ్రమైన జ్వరం ..

 ఎడతెరిపి లేని వర్షాలు .. ఉధృతంగా పారుతున్న వాగు ....

పరిస్థితి ఇలాగే కొనసాగితే _ పసిబిడ్డ ఏమవుతుందో ... !!

ఆ తండ్రి సాహసం చేశాడు ..

బిడ్డను చేతులతో పైకెత్తి _ తలమీద పెట్టుకొని _

పీకల్లోతు వాగులోకి దిగి _ ఇవతలి ఒడ్డుకు చేరాడు !!

లోతుగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి బిడ్డను తీసుకెళ్లాడు !!

ఆ నాన్నకు జేజేలు !

ఆ పాపకు ఆశీస్సులు !!

"బాబూ _ ఓ పాలి గిరిజన గ్రామాల వైపు చూడండి" అని

పాలక ప్రభువులకు వేడుకోళ్ళు, విన్నపాలు !!!

( విశాఖ జిల్లా చింతపల్లి మండలంలోని కుడుముసారి గ్రామం వద్ద

పాంగి సత్తిబాబు అనే తండ్రి తన ఐదు నెలల పాపాయితో ఇలా

వాగు దాటుతున్నప్పుడు  తీసిన ఫొటో ఇది !! "ప్రజాశక్తి" సౌజన్యంతో 

Post a Comment

0Comments

Post a Comment (0)