దయాళుడైన ఒక మహారాజు

Telugu Lo Computer
0


పూర్వము ఒక మహారాజు ప్రజలను తన కన్నబిడ్డలవలె పరిపాలించి చివరకు అవసాన దశకు చేరుకుని మరణించెను. తెలియని దశలో ఒక పాపము చేయుట మూలంగా నరకలోక ప్రాప్తి కలిగినది. యమదూతలు మహారాజును తోడ్కొని నరకమును సమీపించిరి. నరకములో పడి బాధలు అనుభవించుచున్న జీవులకు ఒక్కసారిగా దేహ బాధతీరిసుఖము

కల్గినట్లైనది. వారు మహారాజుతో -- "మహారాజా! దయచేసి ఒక ఘటిక కాలము ఇచ్చట నిలిచియుండండి. మీ దేహగాలి సోకి మా శరీరమందలి మంట, పీడ శాంతించి మాకు సుఖము కలుగుచున్నది" అని వేడుకొనిరి. వారి ప్రార్థన విన్న రాజు"మిత్రులారా!  నేనిక్కడ నిలుచుటవలన మీకు సుఖము అనిపించెనేని ఇక్కడే వుండెదను. ఇక ముందుకు వెళ్లను." అని ఆ జీవులకు బదులు చెప్పెను. అప్పుడు యమ దూతలు -- "మహారాజా! మీరు ధర్మాత్ములు. ఇది మీలాంటి పుణ్య పురుషులు నిలువ దగినస్థానముకాదు. ముందు ముందు పరమోత్తమస్థానము లెన్నియో స్వర్గమునందున్నవి. మనము త్వరగాపోవలెను." అని తొందర పెట్టిరి. దానికి రాజు అంగీకరించక " నా వలన ఇచ్చటి జీవులకు సుఖము ప్రాప్తించినచో ఇది నరకలోకమైననూ ఇక్కడే వుండుటకు ఇష్టపడెదను." అని బదులు చెప్పి కదలక నిలబడి యుండెను. అప్పుడు యమధర్మరాజు, మహేంద్రుడు అచటకుఅరుదెంచిరి. "మహారాజా! మీరాచరించిన పుణ్యకార్యములవల్ల మిమ్ము స్వర్గ లోకమునకు కొనిపోవచ్చితిని,సిద్ధం కండు" అని ఇంద్రుడు చెప్పగా  " ఇంద్రాది దేవతలకు ప్రణామము! ఇక్కడ నరకములో చిక్కుకున్న ఈ జీవులకు సుఖము,శాంతి చేకూరువరకు నేనిచటినుండి కదలలేను." అని మహారాజు బదులు చెప్పెను. " వీరందరు పాపపు జీవులు, వీరిలో పుణ్యకార్యములు చేసినవారెవ్వరూ లేరు. నరకం నుండి వీరికి ఎట్లు విముక్తి కలుగును?" అని యమధర్మరాజు అనగా మహారాజు-- "అయిన యెడల నేను నా పుణ్యమంతయును వీరికి దానం చేసెదను. వీరందరినీ స్వర్గమునకు తీసుకువెళ్లండి. నేనొక్కడను ఇక్కడ నరకములో పడియుందును." అని చెప్పి కూర్చొనెను. ఇంద్రుడు సంతోషించి "మహారాజా! నీవు కోరినట్లే వీరందరినీ స్వర్గ లోకమునకు తీసుకువెళ్లుచున్నాను. మీరు కూడా స్వర్గమునకు బయలు దేరవచ్చును, రండి. "

" నా పుణ్యములన్నిటిని దానం చేసితిని కదా! ఇట్టి నన్ను స్వర్గమునకు ఎల రమ్మనుచున్నారు ఇంద్రుడు ఇలా అన్నాడు.

   " దానము చేయుటవలన ఏ వస్తువైనను మరింత పెరుగును. తరిగిపోదు. నీవద్దనున్న పుణ్యములన్నీ దానం చేసి మరింత పుణ్యం సంపాదించుకున్నావు, ఇక నీవు నిశ్చింతగా కదిలి మా వెంట రావచ్చును." అని నవ్వుతూ ఇంద్రుడు బదులు చెప్పెను.

Post a Comment

0Comments

Post a Comment (0)