ఫేస్‌బుక్‌లో ఎవరినైనా బ్లాక్ చేయాలా?

Telugu Lo Computer
0


పరిచయం అక్కర్లేని సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్‌బుక్. ఎక్కడెక్కడో ఉన్న స్నేహితుల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్లాట్‌ఫామ్ ఇది. దేశాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎక్కడ ఉన్నవారినైనా ఒకే ఒక్క క్లిక్‌తో కనెక్ట్ కావొచ్చు. పరిచయం ఉన్నవారిని స్నేహితులుగా మార్చుకోవడమే కాదు, పరిచయం లేనివారితో స్నేహం పెంచుకోవడానికి కూడా ఈ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుంది. స్నేహాలతో జరిగే మంచి ఎంత ఉందో, చెడు కూడా అంతే ఉంది. ఫేస్‌బుక్ పరిచయాలు, స్నేహాలు అనేక నేరాలకు దారితీస్తుంటాయి. అనవసరమైన చికాకుల్ని సృష్టిస్తుంటాయి. పరిచయం లేనివాళ్లు కూడా మొదట స్నేహం పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి ఆ తర్వాత వేధిస్తుంటారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఫేస్‌బుక్ అనేక కంట్రోల్స్‌ని యూజర్లకు అందిస్తోంది. ప్రైవసీ, సెక్యూరిటీ కంట్రోల్స్ ఉపయోగించుకొని యూజర్లు తాము ఫేస్‌బుక్‌లో షేర్ చేసే కంటెంట్‌ను ఎవరు చూడాలో కూడా యూజర్లు నిర్ణయించొచ్చు. అంతేకాదు... ఎవరినైనా అన్‌ ఫ్రెండ్ చేయొచ్చు. లేదా బ్లాక్ చేయొచ్చు. ఎవరైనా అనవసరమైన మెసేజెస్ పంపిస్తున్నా, ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్ ద్వారా వేధిస్తున్నా అన్‌ ఫ్రెండ్ లేదా బ్లాక్ చేయడం సులువే. ఎవరినైనా అన్‌ ఫ్రెండ్ లేదా బ్లాక్ చేస్తే వారికి ఆ విషయం తెలియదు. బ్లాక్ చేసిన వ్యక్తికి మీరు టైమ్‌ లైన్‌పై షేర్ చేసే పోస్ట్స్ కనిపించవు. వాళ్లు షేర్ చేసే పోస్టుల్లో మిమ్మల్ని ట్యాగ్ చేయడం కూడా కుదరదు. మరి ఫేస్‌బుక్‌లో ఎవరినైనా అన్‌ ఫ్రెండ్ లేదా బ్లాక్ ఎలా చేయాలో తెలుసుకోండి. ఎవరినైనా బ్లాక్ చేయడానికి మీరు ఎవరినైతే బ్లాక్ చేయాలనుకుంటున్నారో వారి ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ప్రొఫైల్ పిక్చర్ కింద కాలమ్‌లో ఫోటోస్, వీడియోస్, కాలింగ్, మెసేజ్ ఐకాన్ కనిపిస్తాయి. కుడివైపున త్రీడాట్స్ ఐకాన్‌ను క్లిక్ చేయాలి. మెనూలో Block ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి. మీరు సదరు ప్రొఫైల్‌ను బ్లాక్ చేయాలనుకుంటున్నారా లేదా అని ఓసారి కన్ఫర్మేషన్ మెసేజ్ అడుగుతుంది. Confirm పైన క్లిక్ చేస్తే మీరు ఆ వ్యక్తిని బ్లాక్ చేసినట్టే. మీరు ఓ వ్యక్తిని బ్లాక్ చేసిన తర్వాత మీరు మనసు మార్చుకొని మళ్లీ అన్‌బ్లాక్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఏ సమయంలోనైనా పైన చెప్పిన స్టెప్స్ ప్రకారం అన్‌బ్లాక్ కూడా చేయొచ్చు. ఎవరినైనా అన్‌ ఫ్రెండ్ చేయాలనుకుంటే సదరు వ్యక్తి ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. త్రీ డాట్స్ పక్కన person ఐకాన్ పైన క్లిక్ చేయాలి. మెనూలో unfriend పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Confirm పైన క్లిక్ చేసి ఆ యూజర్‌ని అన్‌ఫ్రెండ్ చేయొచ్చు. 

Post a Comment

0Comments

Post a Comment (0)