దళిత పదం వాడటం మానుకోండి

Telugu Lo Computer
0


' దళిత ' అనే పదాన్ని వాడటం మానుకోవాలని పంజాబ్ ఎస్సీ కమిషన్ మంగళవారం స్పష్టం చేసింది. పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్‌సింగ్ ఛన్నీ బాధ్యతలు స్వీకరించడంతో మీడియాలో పలుమార్లు తొలి దళిత సీఎం అని రావడంతో ఈ సూచనలను జారీ చేసింది. ఎస్సీ కమిషన్ ఛైర్‌పర్సన్ తేజీందర్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ..'' రాజ్యాంగంలో దళిత అనే పదాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. గతంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలకు లేఖ రాస్తూ ఇదే విషయాన్ని చెప్పింది. ఎస్సీ, ఎస్టీ తెగలకు చెందిన సభ్యులను గురించి ప్రస్తావించేటప్పుడు దళిత అనే పదాన్ని వాడటం మానుకోవాలని మధ్యప్రదేశ్ హైకోర్టు 2018లోనే తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలో దళిత అనే పదం ఎక్కడ లేదు అని హైకోర్టు కూడా చెప్పింది. దళిత అనే పదానికి బదులు షెడ్యూల్డ్ తెగలు అనే పదం వాడాలని హైకోర్టు సూచించింది '' అని ఆమె అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)