ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ఎ ఎస్ రావు

Telugu Lo Computer
0

 


"దేవుడు లేడు" అని చెప్పిన మొదటి వ్యక్తి డాక్టర్ అయ్యగారి సాంబశివ రావు గారు. (రంగనాయకమ్మ గారు నాకు మార్క్సిజం గురించి చెప్పక ముందే)  ఆయన ప్రముఖ సైంటిస్ట్, ఇసిఐఎల్ సంస్థ వ్యవస్థాపకుడు. ఎ ఎస్ రావు గారు ఓసారి వాళ్ళ ఆవిడ గురించి ఓ మాట అన్నారు  దైవ భక్తి నుంచి ఆమెను బయటపడేయాలని 40 ఏళ్లుగా ప్రయత్నించి ఓడిపోయి ఇక వదిలేసాను ఒక సైంటిస్ట్ అయ్యుండి కనీసం భార్యలో  కూడా శాస్త్రీయ దృక్పదంతో కూడిన   ఆలోచన తీసుకురాలేకపోయినందుకు చాలా సిగ్గుగా ఉంటుంది.  ఇప్పుడు మన ఇస్రో,  శ్రీహరి కోట సైంటిస్ట్ లు రాకెట్ లాంచ్ ముందు చేసే పూజలూ భక్తి విన్యాసాలు చూస్తే సిగ్గుపడాలి. 
చాలా మంది భక్తులు అసలు ఆలోచించడానికే ఇష్టపడరు, ఆలోచిస్తే  మారిపోతామేమో అనే  భయం కూడా కొందరిలో ఉంటుంది మార్పు ఇష్టపడరు (దేవుడి విషయంలో ) కాబట్టి నిజాల్ని తెలుసుకోడానికే  ఇష్టపడరు అన్నారు.  ఆయన  సింప్లిసిటీ, నిరాడంబరంగా బతకడం. హెల్పింగ్ నేచర్.  భారతదేశం గర్వించదగ్గ సైంటిస్ట్,  నా ఫేవరెట్ సైంటిస్ట్ అని అప్పటి ప్రధాని నెహ్రూగారి చేత ప్రశంసలు అందుకున్న ఎ ఎస్ రావు గారు అంత ఉన్నత స్థాయిలో ఉండి కూడా అత్యంత  సాధారణ జీవితం గడిపేవారు. ఇసిఐఎల్  ఉద్యోగులు ఆయన మీద ప్రేమతో గౌరవంతో అప్పట్లో వాళ్ళు నివసించే ప్రాంతానికి 'డా. ఎ. ఎస్. రావ్ నగర్'  అని పేరు పెట్టుకున్నారు.  ఇప్పుడు హైదరాబాద్ లో 'ఎ.ఎస్ రావ్ నగర్ ' పెద్ద కమర్షియల్ ఏరియా.  వృద్ధాప్యంలో కూడా ఆయన ఆ ప్రాంతానికి వెళ్లాలంటే సిటీ బస్ లోనే  ప్రయాణించేవారు.  ఎ.ఎస్.రావ్ నగర్ కి టికెట్ కావాలని ఎన్నోసార్లు అడిగినా ఈయనే ఆ ఎ. ఎస్. రావ్ అని కండక్టర్ కి తెలిసేది కాదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)