భోజన ప్రియుని కవిత. - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 4 September 2021

భోజన ప్రియుని కవిత.

 


పూతరేకులరిసె పూర్ణాలు బొబ్బట్లు

కాకినాడ కాజ కజ్జికాయ

బాదుషాలు జాంగ్రి పాయసమ్ముల కన్న

తీయనైన భాష తెలుగు భాష !

మిసిమి బంగినపల్లి మామిడుల రుచులు

తాటిముంజలు మేటి సీతాఫలాలు

మెరయు చక్కెరకేళి మాధురులకన్న

తీయనైనది నా భాష తెలుగు భాష !

పెసరపిండి పైన ప్రియమగు నల్లంబు

దానిపైన మిర్చి దద్దరిల్ల

జీలకర్ర తోడ జేర్చిన ఉప్మాకు   

సాటి తెలుగు భాష మేటి భాష.

స్వర్గమందు దొఱకు చప్పని అమృతంబు

త్రాగలేక సురులు ధరణి లోన

ఆంధ్ర దేశమందు ఆవిర్భవింతురు    

ఆవకాయ కొఱకు నంగలార్చి.

కూర్మి తోడ తెచ్చి గోంగూర యాకులు

రుబ్బి నూనె మిర్చి యింపు తోడ

కారమింగువలను తగిలించి తిను వాడు

ఘనుడు తెలుగు వాడు కాదె భువిని.

ఆటవెలది యనిన అభిమానమెక్కువ

తేటగీతి యనిన తియ్య దనము

సీస పద్యమనిన చిత్తమ్ము రంజిల్లు

కంద పద్యమెంత సుందరమ్ము.

No comments:

Post a Comment