అష్ట దిక్కుల ప్రాధాన్యత! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 7 September 2021

అష్ట దిక్కుల ప్రాధాన్యత!

 


మనకు ఎనిమిది దిక్కులు ఉన్నాయి. వాటిని 'అష్ట దిక్కులు' అంటాము. వాటిని పాలించే వారిని 'దిక్పాలకులు' అంటారు.

దిక్కులు: తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణములను 'దిక్కులు' అంటారు.

విదిక్కులు: ఈ నాలుగింటితో పాటు ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము అను నాలుగు విదిక్కులు కూడా కలవు. అన్నింటిని కలిపి అష్టదిక్కులు అంటాము.

1.) తూర్పు: తూర్పు దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత ఇంద్రుడు. ఇంద్రుని భార్య శచీదేవి. ఆయన వాహనము ఏనుగు. నివసించే పట్టణము 'అమరావతి.' ఇంద్రుడు ధరించే ఆయుధము వజ్రాయుధము. ఈయన పురుష సంతాన కారకుడు. అధికారం కలుగజేయువాడు. సూర్య గ్రహం ప్రాధాన్యత వహించే ఈ దిక్కు దోషం వలన అనారోగ్య సమస్యలు, అధికారుల బాధలు ఉంటాయి.

2.) ఆగ్నేయ మూల: ఆగ్నేయ దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత అగ్నిహోత్రుడు. అగ్ని భార్య స్వాహాదేవి. వాహనము పొట్టేలు. అగ్నిహోత్రుడు నివసించే పట్టణము తేజోవతి. ధరించే ఆయుధము శక్తి. ఈయన కోపం, అహంకారం ప్రసాదించే వాడు. ఆగ్నేయం శుక్రుడు ప్రాదాన్యత వహిస్తాడు. ఆగ్నేయం వంటకు సంబందించిన దిక్కు. వంట స్త్రీలకు సంబదించినది కాబట్టి ఈ దిక్కు దోషం వలన స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి.

3.) దక్షిణము: దక్షిణ దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత యమధర్మరాజు. ఈయనకు దండపాణి అని మరో నామధేయమున్నది. యముని భార్య శ్యామలాదేవి. యముని యొక్క వాహనము మహిషము (దున్నపోతు). నివసించే పట్టణము సంయమని. యముడు ధరించే ఆయుధము దండము. దండమును ఆయుధముగా కలవాడు కాబట్టి ఈయనను 'దండపాణి' అని కూడా అంటారు. యముడు వినాశనం, రోగం ప్రసాదించేవాడు. కుజుడు ఆదిపత్యం వహించే దక్షిణ దిక్కు లోపం వలన తరచు వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి.

4.) నైరుతి మూల: నైరుతి దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత నివృత్తి అనే రాక్షసుడు. ఇతని భార్య దీర్ఘాదేవి. వాహనము నరుడు. ఇతడు నివసించే పట్టణము కృష్ణాంగన. నైరుతి ధరించే ఆయుధము కుంతము. వంశ నాశకుడు నైరుతి. నైరుతి దిక్కు రాహుగ్రహ ప్రాదాన్యత ఉంటుంది కాబట్టి ఈ దిక్కు దోషం వలన కుటుంబంలో ఎప్పుడు మానసికమైన చికాకులు అధికం.

5.) పడమర: పడమర దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత వరుణుడు. వరుణుని భార్య కాళికాదేవి. వాహనము మకరము (మొసలి). ఇతడు నివసించే పట్టణము శ్రద్ధావతి. ధరించే ఆయుధము పాశము. సర్వ శుభములను ప్రసాదించేవాడు. పడమర దిక్కు శనిగ్రహ ప్రాధాన్యత వలన ఈ దిక్కు దోషం వలన పనులు జాప్యం కలుగుతాయి.

6.) వాయువ్య మూల: వాయువ్య దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత వాయువు. అనగా వాయుదేవుడు. ఈయన భార్య అంజనాదేవి. వాహనము లేడి. నివసించే పట్టణము గంధవతి. ధరించే ఆయుధము ధ్వజము. పుత్ర సంతానమును ప్రసాదించువాడు. వాయువ్య దిక్కు చంద్రుడు ఆదిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన ఒడిదుడుకులు ఉంటాయి.

7.) ఉత్తరము: ఉత్తర దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత కుబేరుడు. ఇతని భార్య చిత్రలేఖ. వాహనము గుర్రము. కుబేరుడు నివసించే పట్టణము అలకాపురి. కుబేరుడు ధరించు ఆయుధము ఖడ్గము. విద్య, ఆదాయము, సంతానము, పలుకుబడి ప్రసాదించువాడు. బుధుడు ఉత్తరదిక్కు ఆదిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన వ్యాపారం, విద్యా సంబంద విషయాలలో ఇబ్బందులు వస్తాయి.

8.)ఈశాన్య మూల: ఈశాన్య దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత శివుడు. శివుని భార్య పార్వతీదేవి. శివుని వాహనము వృషభము(ఎద్దు). నివసించు ప్రదేశం కైలాసం. శివుడు ధరించు ఆయుధం త్రిశూలం. గంగాధరుడు శివుడు అష్టైశ్వర్యాలు, భక్తి జ్ఞానములు, ఉన్నత ఉద్యోగములను ప్రసాదించేవాడు. ఈశాన్య దిక్కు గురుగ్రహ ఆదిపత్యం ఉంటుంది. ఈశాన్య దిక్కు లోపం ఉంటే సంతాన విషయంలో ఇబ్బందులు ఎర్పడతాయి.

ఈ విధంగా ఎనిమిది దిక్కులలో ఎనిమిది మంది దిక్పాలురు ఉండి మానవులను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు. దిక్కులేని వారు అనేవారు లేకుండా దిక్కుగా, దిక్సూచిగా కాపాడుతూ ఉంటారు.

దిక్పాలకులకు కూడా సర్వాధికారి శ్రీ మహా విష్ణువు. అష్ట దిక్కులకు వారిని నియమించి, విధి విధానాలను, నియ మాలను, ధర్మాలను ఆజ్ఞాపించు వాడు, నడి పించు వాడు, అధి(పతి)కారి శ్రీ మహా విష్ణువే సకల దేవతల చక్రవర్తి శ్రీ మహావిష్ణువు.

No comments:

Post a Comment