తల దగ్గర దీపం ?

Telugu Lo Computer
0

 

దీపం అనేది సకలశుభాలను సూచిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ప్రతి శుభాకార్యాన్ని కూడా జ్యోతిని వెలిగించి ఆరంభిస్తూ వుంటారు. అంతటి విశిష్టమైన దీపాన్ని చనిపోయిన వారి తల దగ్గర వుంచడమనేది మన ఆచార వ్యవహారాలలో భాగంగా వస్తోంది.జీవంతో వున్నప్పుడు వ్యక్తిని సరైన దారిలో నడిపించడానికి దీపం ఎలా సహకరిస్తుందో, జీవాన్ని కోల్పోయిన తరువాత ఆత్మకు సరైన దారి చూపడంలోను దీపం సహకరిస్తుందనే విషయం స్పష్టమవుతుంది. ఏ వ్యక్తి అయినా చనిపోయినప్పుడు, ఆయన ఆత్మ 'బ్రహ్మ కపాలం' ద్వారా బయటికి రావాలనే కుటుంబ సభ్యులు కోరుకుంటారు. ఎందుకంటే బ్రహ్మ కపాలం ద్వారా ఆత్మ బయటికి వచ్చినప్పుడే ఇక ఆ వ్యక్తికి మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా బయటికి వచ్చిన ఆత్మ పైలోకాలకి ప్రయాణించడానికి రెండు మార్గాలు వుంటాయి. అందులో ఒకటి ఉత్తరమార్గం కాగా, మరొకటి దక్షిణమార్గం. ఉత్తరమార్గం పూర్తి వెలుగుతోను ... దక్షిణమార్గం పూర్తి చీకటితోను కప్పబడి వుంటాయి. వెలుగుతో కూడిన మార్గంలో ప్రయాణించినప్పుడే ఆత్మకు ఉత్తమగతులు కలుగుతాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మకపాలం నుంచి బయటికి వచ్చిన ఆత్మకి ఆ వెలుగు మార్గాన్ని చూపించే ఉద్దేశంతో ఆ స్థానంలో దీపాన్ని వుంచుతుంటారు. తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారం వెనుక దాగిన అర్థం ఇదే.

Post a Comment

0Comments

Post a Comment (0)