చిన్న హోటల్‌లో అల్లు అర్జున్‌

Telugu Lo Computer
0


ప్రముఖ నటుడు అల్లు అర్జున్ రోడ్డు పక్కన ఉండే చిన్న హోటల్‌లో తినడం ఎప్పుడైనా చూశారా? అయినా ఆయన అలాంటి హోటల్‌కి ఎందుకెళ్తారనే కదా మీ సందేహం. దీనికి తగిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అర్జున్‌ ఓ కాకా హోటల్‌లో అల్పాహారం తీసుకుని, హోటల్ యజమానికి డబ్బులిస్తున్న వీడియోను ఎవరో సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. దీన్ని చూసిన నెటిజన్లు 'అల్లు అర్జున్‌ సింప్లిసిటీకి మారుపేరు' అంటూ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ వీడియోలో అర్జున్‌ చాలా కూల్‌గా, స్టైలిష్‌గా కనిపించారు. అర్జున్‌ నటిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం 'పుష్ప' కాకినాడ పోర్టులో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఎర్ర చందనం అక్రమ రవాణాకి సంబంధించిన కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అర్జున్‌ ఇలా సరదాగా బయటికి వచ్చి, ఆ హోటల్‌కి వెళ్లారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సుకుమార్‌ దర్శకుడు. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'ఆర్య', 'ఆర్య 2' చిత్రాల తర్వాత సుకుమార్‌- అర్జున్‌ కలిసి పనిచేస్తుండటంతో 'పుష్ప'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)