చీర కట్టుకొని రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు అవమానం

Telugu Lo Computer
0


మహిళలు చీర కట్టుకోవడం భారతీయ సంస్కృతి, సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం. ఏ డ్రెస్‌, జీన్స్‌ వేసుకున్నా చీర కట్టుకుంటే వచ్చే గొప్పదనమే వేరు. అయితే దేశ రాజధాని ఢిల్లీలో చీర ధరించి రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. మహిళ జర్నలిస్ట్‌ అనితా చౌదరి తన కూతురు పుట్టిన రోజుని జరుపుకునేందుకు డిల్లీలోని అక్విలా రెస్టారెంట్‌కు వెళ్లారు. అయితే ఆమె చీర కట్టులో వచ్చినందుకు రెస్టారెంట్‌ సిబ్బంది లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. చీర సాధారణ క్యాజువల్‌​ డ్రెస్‌ కోడ్‌ కిందకు రాదని, రెస్టారెంట్‌లోకి కేవలం క్యాజువల్స్‌నే అనుమతిస్తామని సిబ్బంది పేర్కొన్నారు. దీనిపై మహిళ ఎంద వాదించిన లోపలికి అనుమతించలేదు. దీంతో తన ఎదురైన చేదు అనుభవాన్ని అనితా చౌదరి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఢిల్లీలోని రెస్టారెంట్‌లో చీర స్మార్ట్‌ అవుట్‌ఫిట్‌ కాదట అంటూ పేర్కొన్న ఈ వీడియోలో.. 'నాకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను చీరలోనే పెళ్లి చేసుకున్నాను. చీర కట్టుకోవడం నాకు చాలా ఇష్టం. భారతీయ వస్త్రధారణ, సంస్కృతిని ప్రేమిస్తున్నాను. అయితే నిన్న నా కూతురు పుట్టినరోజు జరుపుకునేందకు అక్విలా రెస్టారెంట్‌కు వెళ్లాము. మేము ముందే అక్కడ ఓ టేబుల్‌ను బుక్‌ చేసుకున్నాము. కానీ నేను చీర కట్టుకున్నందుకు లోపలికి అనుమతించలేదు. ఎందుకంటే భారతీయ చీర ఇప్పుడు స్మార్ట్ దుస్తులు కాదు. స్మార్ట్ ఔట్‌ఫిట్‌కు ఖచ్చితమైన నిర్వచనం ఏంటో నాకు చెప్పండి. ఎందుకంటే అప్పుడు నేను చీర కట్టుకోవడం మానేస్తాను. నా చీర కారణంగా జరిగిన అవమానం ఇప్పటి వరకు నాకు జరిగిన అవమానాల కంటే పెద్దది. ఇది నా హృదయాన్ని కలచివేసింది'. అంటూ పేర్కొన్నారు. కాగా వీడియో చేసిన నెటిజన్లు రెస్టారెంట్‌ ప్రవర్తించిన తీరుపై మండిపడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)