హ్యాపీనెస్ట్‌కు రివర్స్ టెండరింగ్ కు స్పందన కరువు

Telugu Lo Computer
0


హ్యాపీనెస్ట్ రివర్స్ టెండరింగ్‌కు గడువు ముగిసింది. అయినా సింగిల్ టెండర్ కూడా పడలేదు. దీంతో హ్యాపీనెస్ట్ భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారింది. హ్యాపీనెస్ట్‌పై వైసీపీ ప్రభుత్వం ముందునుంచి ఆసక్తిగా లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పనులను పూర్తి చేసి లబ్దిదారులకు ఫ్లాట్లను కేటాయించాల్సి ఉంది. అయితే రెండున్నరేళ్లుగా కాలయాపన చేసిన జగన్ ప్రభుత్వం సమయం దగ్గరకు వచ్చే సరికి హడావుడి మొదలు పెట్టింది. బాధితులు కోర్టును ఆశ్రయించకుండా రివర్స్ టెండర్ ఎత్తివేసింది. అమరావతి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలో ప్రభుత్వంపై కాంట్రాక్టర్లకు నమ్మకం పోయింది. ఇదే సమయంలో రూ. 640 కోట్ల విలువైన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు ఏఎమ్ఆర్డీఏ రివర్స్ టెండర్లు పిలిచింది. వీటికి కూడా కాంట్రాక్టర్ల నుంచి స్పందన కరువైంది. కేవలం కోర్టుకు, లబ్దిదారులకు సమాధానం చెప్పుకోవడానికి రివర్స్ టెండర్లను ముందుకు తెచ్చారని కాంట్రాక్టర్లు గ్రహించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజధానిలో నిర్మాణాలు అర్దాంతరంగా నిలిపివేశారు. వైసీపీ సర్కార్ మూడు రాజధానుల రాగం ఎత్తుకోవడంతో కాంట్రాక్టర్లు హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు టెండర్లు వేయడానికి ముందుకు రాలేదని తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)