టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకం రద్దు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి షాక్ తగిలింది. టీటీడీ పాలకమండలి  నియామకంపై హైకోర్టు సీరియస్ అయింది. ఇటీవల ప్రభుత్వం నూతన పాలకమండలి నియమించగా ప్రత్యేక ఆహ్వానితులుగా 52 మందిని నియమించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారంటూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం వల్ల భక్తులపై భారం పడుతుందని పిటిషనర్ల తరపు లాయర్లు వాదించారు. దీనితో ఏకీభవించిన కోర్టు ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన 568, 569 జీవోలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. దేవాదాయ శాఖ చట్టానికి విరుద్ధంగా నియామకం జరిగిందని పిటిషనర్లు పేర్కొన్నారు. టీటీడీ బోర్డులో 80 మంది కంటే ఎక్కువ మంది సభ్యులుగా ఉండటం నిబంధనలకు విరుద్ధమని వాదించారు. దీంతో హైకోర్టు రెండు జీవోలను రద్దు చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)