ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభం

Telugu Lo Computer
0

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను ప్రారంభించారు. దీనిని "దేశం నేడు ప్రవేశిస్తున్న కొత్త మరియు అసాధారణ దశ" గా అభివర్ణించారు. ఈ మిషన్ భారతదేశ ఆరోగ్య సదుపాయాలలో "విప్లవాత్మక మార్పులను" తీసుకువచ్చే శక్తిని కలిగి ఉందని ఆయన అన్నారు. 2018 లో మొదటిసారి ఆయుష్మాన్ భారత్ గురించి ప్రస్తావన వచ్చి అమలుచేశారు. అయితే మూడేళ్ల తర్వాత ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభించినందుకు ప్రధాని మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ పథకం పేదలు మరియు మధ్యతరగతి వారు వైద్య చికిత్స పొందడంలో ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను తొలగించడం ద్వారా అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)