రమేష్‌బాబు 96వ ప్రపంచ రికార్డు

Telugu Lo Computer
0

 

నగరంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్‌ రమేష్‌బాబు (65) మరో వినూత్న రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఎంతో కఠినమైన, నోరు తిరగని పదాలు ఉన్న 2,400 వరుసల సంస్కృత శ్లోకాలను కేవలం గంట వ్యవధిలో పఠించి సరికొత్త రికార్డును నెలకొల్పారు. రమేష్‌బాబుకు ఇది 105వ రికార్డు కాగా 96వ ప్రపంచ రికార్డు కావడం విశేషం. ఆదిశంకరాచార్య రచించిన నరసింహ స్త్రోత్రంతో పాటు పలు కఠినమైన పదాలు కలిగిన శ్లోకాలను ఆయన తన రికార్డు ప్రయత్నం కోసం ఎంపిక చేసుకున్నారు. ప్రముఖ పండితుడు ఆచార్య జీఎన్‌ రత్నతో పాటు విద్యావేత్తలు వెంకటరంగ, నవీన్‌ నామ్‌ పెరుమాళ్‌, సంస్కృత పండితుడు డాక్టర్‌ పీకే శ్రీవాత్సవ తదితరులు రమేష్‌బాబు రికార్డు ప్రయత్న సమయంలో హాజరై ఆయనను వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఈ ఏడాది చివరికి నాటికి వంద ప్రపంచ రికార్డులను నెలకొల్పాలన్నది తన లక్ష్యమన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)