రూ.40 వేలకే ఎలక్ట్రిక్ టూవీలర్

Telugu Lo Computer
0

  


స్వదేశీ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ డీటెల్ సరికొత్త ఈవీ ఈజీ ప్లస్ టూ-వీలర్‌ను లాంచ్​ చేసింది. ఈ కొత్త ఇ-బైక్​ను రూ. 39,999 వద్ద విడుదల చేసింది. జీఎస్​టీతో కలిపి రూ. 41,999 ధర వద్ద ఈ టూవీలర్​ అందుబాటులో ఉంటుంది. ఇది సిల్వర్ గ్రే, మెటాలిక్ రెడ్  వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెండు వేరియంట్లను డీటెల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా​ వీటిని కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఆసక్తిగల కొనుగోలుదారులు కొత్త ఈవీ ఈసీ ప్లస్‌ని కేవలం రూ. 1,999 టోకెన్ ధర చెల్లించి బుక్ చేసుకోవచ్చని తెలిపింది. మిగతా రూ. 40 వేలు టూవీలర్​ డెలివరీకి 7 రోజుల ముందు చెల్లించాల్సి ఉంటుంది. గురుగ్రామ్‌కు చెందిన డీటెల్​ టూ వీలర్ సంస్థ హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్​తో సహా వివిధ రాష్ట్రాల్లో డీలర్​షిప్​ నెట్​వర్క్​ను కలిగి ఉంది. సమీప భవిష్యత్తులో ప్రధాన నగరాల్లోకి నెట్​వర్క్​ను విస్తరించాలని యోచిస్తోంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కొత్త EV ఈజీ ప్లస్ డ్రైవింగ్ రేంజ్ 60 కిలోమీటర్లు, గరిష్ట వేగం గంటకు 25 కిలో మీటర్ల వరకు ఉంటుంది. ఇందులో 20Ah బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీని రైడర్ సీటు క్రింద అమర్చారు. టైర్లు కూడా డ్రమ్ బ్రేక్‌ సిస్టమ్​తో రూపొందాయి. ఇది 170 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్​ టూవీలర్​ని 5 ఆంపియర్ స్లాట్‌లో పెట్టి ఛార్జ్ చేయవచ్చు. డీటెల్ కంపెనీకి చెందిన ఈజీ ప్లస్ టూవీలర్​ రోడ్‌సైడ్ అసిస్టెన్స్, సర్వీసెస్, ఇన్సూరెన్స్‌లను కూడా అందిస్తోంది. దీన్ని ఈఎంఐ ఆప్షన్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ సరికొత్త వాహనంపై డీటెల్ వ్యవస్థాపకుడు డాక్టర్ యోగేష్ భాటియా మాట్లాడుతూ, "భారతదేశంలో ఎలక్ట్రిక్​ వాహన మార్కెట్​ను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈసీ ప్లస్​ మా బ్రాండ్​ నుంచి విడుదలైన రెండవ ఉత్పత్తి. అడ్వాన్స్​డ్​ టెక్నాలజీతో రూపొందిన ఈ టూవీలర్​ను సరసమైన ధర వద్దే అందిస్తున్నాం. ఇటీవలి కాలంలో భారత్​లో ఎలక్ట్రిక్​ టూవీలర్లకు డిమాండ్​ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సమీప భవిష్యత్తులో మరిన్ని వాహనాలను లాంచ్​ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం." అని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)