ఉన్నతనుమలయన్ ఆలయం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 2 August 2021

ఉన్నతనుమలయన్ ఆలయం


తమిళనాడులోని కన్యాకుమారికి 10 కిలోమీటర్ల దూరంలో  సుచీంద్రం  అనే ఊరిలో ఉన్నతను మలయన్ ఆలయం భారతీయ శిల్పకళా వైభవానికి ఓ మచ్చుతునక.  చోళ రాజుల చేత నిర్మించబడిన ఈ ఆలయం యొక్క ప్రధాన గోపురం ఎత్తు 134 అడుగులు.  అంత ఎత్తున్న ఈ ఆలయ ప్రధాన గోపురంపై ఒక లక్షకి పైగా శిల్పాలున్నాయి. గౌతమ మహర్షి శాపం నుండి ఇంద్రుడు విముక్తి పొందడానికై త్రిమూర్తులను ఏక లింగంపై ప్రతిష్టించి కొలిచిన ప్రదేశమని పురాణ కధనం. ఈ ఆలయంలోని అలంకార మండపంలో ముట్టుకుంటే సంగీతం వినిపించే సంగీత స్థంభాలు ఉన్నాయి. ఒక్కో స్థంభం ఒక్కో విధంగా ధ్వనించడం ఇక్కడి విశేషం. ఆలయం వెలుపల పద్దెనిమిది అడుగుల ఎత్తు రాతి హనుమంతుని విగ్రహం మనకు కనిపిస్తుంది. ఇలా అనేక విశేషాలతో నిండి ఉన్న ఈ ఆలయం తప్పకుండా చూడాల్సిన ఆలయాలలో ఒకటి.


No comments:

Post a Comment