ప్రసూతి సెలవులు పెంచిన తమిళనాడు

Telugu Lo Computer
0


2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎంకే ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు మహిళా ప్రభుత్వ ఉద్యోగుల ప్రసూతి సెలవుల కాల పరిమితిని తొమ్మిది నెలల నుండి ఒక సంవత్సరానికి తమిళనాడు ప్రభుత్వం పెంచినట్లు . ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ సంవత్సరం వరకు వాళ్లకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తారు.  ఈ నిబంధన జూలై 1, 2021 నుంచి అమలులోకి తీసుకోబడుతుందని తెలిపారు. ఇద్దరు లేక ఒకరు పిల్లలు ఉన్న మహిళలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. తమిళనాడులో తాజా పాలసీ మొదటగా తల్లిపాలు తాగే నవజాత శిశువుల సంఖ్యను పెంచాలనే రాష్ట్ర లక్ష్యానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. తమిళనాడు ఆర్థిక మంత్రి 2021-22 సంవత్సరానికి మొదటి పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)