అతి చిన్న మొబైల్

Telugu Lo Computer
0



సాధారణంగా స్మార్ట్‌ఫోన్ సైజ్ ఎంత ఉంటుంది. 5 అంగుళాల నుంచి 7 అంగుళాల వరకు ఉంటుంది. కానీ చైనాకు చెందిన మోనీ కంపెనీ మింట్ పేరుతో అతి చిన్న సైజులో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 3 అంగుళాల డిస్‍ప్లే మాత్రమే ఉంటుంది. అంటే క్రెడిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ సైజులో ఈ స్మార్ట్‌ఫోన్ ఉండటం విశేషం. ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్ ఇది. గతంలో పామ్ ఫోన్ రిలీజ్ అయింది. ఆ ఫోన్ సైజ్ 3.3 అంగుళాలు. కానీ మోనీ మింట స్మార్ట్‌ఫోన్ సైజ్ 3 అంగుళాలు మాత్రమే. ఈ స్మార్ట్‌ఫోన్ ధర 150 డాలర్లు. అంటే సుమార రూ.11,131. ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద కేవలం 100 డాలర్లకే ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. అంటే ధర రూ.7,500 లోపే ఉంటుంది. ఇండీగోగో క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్ ద్వారా కొనొచ్చు. 100 డాలర్ల ఎర్లీ బర్డ్ స్లాట్స్ పూర్తైతే, 115 డాలర్లు, 130 డాలర్ల ఎర్లీ బర్డ్ స్లాట్స్ కూడా ఉన్నాయి. ఈ డీవైజ్ ఇప్పుడు ఆర్డర్ చేస్తే నవంబర్‌లో లభిస్తుంది. 4జీ స్మార్ట్‌ఫోన్. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ ఉంది. 3 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. 1.5GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 3జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్‌డీ కార్డుతో 128జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. గూగుల్ ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 1,250ఎంఏహెచ్ పాలీమర్ బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్ కోసం టైప్ సీ పోర్ట్ ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 72 గంటల వరకు వాడుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్లూ, బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ బరువు కూడా తక్కువే. స్పోర్ట్స్, జాగింగ్ లాంటి ఔట్ డోర్ యాక్టివిటీస్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ వాడుకోవచ్చు. 

Post a Comment

0Comments

Post a Comment (0)