ఇమ్రాన్ ఖాన్ మేధోశక్తి !

Telugu Lo Computer
0


పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మేధోశక్తిని మరోసారి నిరూపించుకున్నారు. ఇటీవల ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశ జనాభా ''వన్‌ బిలియన్‌ అండ్‌ త్రీ హండ్రెడ్‌ క్రోర్స్‌'' అని అన్నారు. ప్రస్తుతం ఇమ్రాన్‌కు సంబంధించిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇక ఇంతకు మందు జపాన్, జర్మనీ పొరుగు దేశాలు అని తెలిపిన ఇమ్రాన్‌ చైనాను పాకిస్తాన్ పొరుగు దేశంగా కూడా తిరస్కరించిన సంగతి తెలిసిందే. భౌగోళికంగా జపాన్, జర్మనీ దేశాలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ పాకిస్తాన్ సరిహద్దులుగా ఉన్నాయి. అంతే కాకుండా 2019 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 136 కోట్లు. దీంతో ఈ వీడియోకు సంబంధించి నెటిజన్‌లు ఇమ్రాన్ ఖాన్ భౌగోళిక పరిజ్ఞానాన్ని లక్ష్యంగా చేసుకుని కామెంట్స్‌ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)