తొక్కలు కూడా ఆరోగ్యాన్నిస్తాయట !

Telugu Lo Computer
0


మామిడి పండ్లు రంగు, రుచితో అందరినీ ఆకట్టుకుంటాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా ఇష్టంగా తింటుంటారు. అయితే చాలా మంది పండు తిని తొక్క పడేస్తుంటారు. కానీ ఈ మామిడి తొక్కల వల్ల చాలా లాభాలు ఉన్నాయట.! మామిడి తొక్కలో ఫైటోకెమికల్స్‌, పాలీఫినాల్స్‌, కెరోటినాయిడ్లు, ఎంజైమ్​లు, విటమిన్‌ ''ఇ' విటమిన్‌ ''సి'' వంటి విలువైన సమ్మేళనాలు అధికంగా ఉన్నాయి. మహిళలు అందంగా ఉండడానికి అనేక పద్ధతులని ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు అందాన్ని మరింత పెంచుకోవడానికి మామిడి తొక్కలు బాగా ఉపయోగపడతాయి. దీని కోసం కొన్ని మామిడి తొక్కలు తీసుకుని పేస్టులాగా చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత కడిగేసుకుంటే ముడతలు తొలగిపోతాయి. మామిడి తొక్కలో ఫైబర్‌, సెల్యులోజ్, హెమిస్యొలోజ్‌, లిపిడ్లు, ప్రొటీన్లు, పెక్టిన్‌ అధికంగా ఉన్నాయి. పొటాషియం, రాగి, జింక్‌, మాంగనీస్‌, ఇనుము, సెలీనియం మొదలైనవి వీటిలో లభించే కొన్ని ముఖ్యమైన ఖనిజాలు. ఈ విలువైన సమ్మేళనాలు మానవుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే మామిడి తొక్క పిండిని నూడుల్స్‌, బ్రెడ్‌, స్పాంజి కేకు, బిస్కెట్లు, మాకరోనీ, ఇతర బేకరీ ఉత్పత్తులు వంటి అనేక ఆహార పదార్ధాల ఉత్పత్తులలో ప్రముఖంగా ఉపయోగిస్తారు. వ్యర్థమని పడేసే మామిడి తొక్కలతో ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు.  కొన్ని మామిడి తొక్కలని తీసుకుని కొన్ని రోజులు  ఎండబెట్టాలి. తరువాత వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. దానిలో కొద్దిగా పెరుగు కాని రోజు వాటర్ కాని కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే డార్క్ స్పాట్స్ తగ్గిపోతాయి. ముఖం మీద ఉండే ట్యాన్ ని తొలగించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలా కుదరకపోతే మామిడి తొక్కల్ని ముఖం మీద వేసి దానితో మసాజ్ చేసుకున్నా సరిపోతుంది. కాసేపు మసాజ్ చేసి ఆరిన తర్వాత ముఖాన్ని కడిగేసుకుంటే ముఖంపై ట్యాన్ ని తొలగించుకోవచ్చు. అలానే యాక్నీ, పింపుల్స్ వంటి సమస్యలు కూడా పోతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)