అడిషనల్ డీజీపీగా సీవీ ఆనంద్‌

Telugu Lo Computer
0


తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు మరో 11 మంది అధికారులకు అడిషనల్ డీజీపీ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ డీజీపీ హోదా పొందిన వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సీవీ ఆనంద్ ( తెలంగాణ కేడర్ – 1991 బ్యాచ్ ), జితేందర్ ( తెలంగాణ కేడర్ – 1992 బ్యాచ్ ), నలిన్ ప్రభాత్ ( ఆంధ్రప్రదేశ్ కేడర్ – 1992 బ్యాచ్ ) ఉన్నారు. 1992 బ్యాచ్ చెందిన పలువురి ఐపీఎస్ ఆఫీసర్లకు అడిషనల్ డీజీపీ హోదా కల్పించినప్పటికీ.. ఇందులో ముగ్గురు మాత్రం వేరే బ్యాచ్‌లకు చెందిన వారున్నారు. ఆ ముగ్గురిలో ప్రశాంత్ కుమార్ ( యూపీ – 1990 ), సీవీ ఆనంద్ ( తెలంగాణ – 1991 ), వివేక్ గోగియా ( యూటీ – 1991 ) ఉన్నారు. మిగతా వారు : నలిన్ ప్రభాత్ ( ఏపీ ), బీ శ్రీనివాసన్ ( బీహార్ ), లలిత్ దాస్ ( ఒడిశా ), సాప్నా తివారీ ( ఒడిశా ), హర్‌ప్రీత్ సింగ్ సిద్ధూ ( పంజాబ్ ), రాజేశ్ నిర్వాన్ ( రాజస్థాన్ ), హేమంత్ ప్రియదర్శి ( రాజస్థాన్ ), జితేందర్ ( తెలంగాణ ), ఆనంద్ స్వరూప్ ( యూపీ ), ఎంఎం ఓబెరాయ్ ( యూటీ ), పంకజ్ సక్సెనా ( యూటీ – జమ్మూకశ్మీర్ ).

Post a Comment

0Comments

Post a Comment (0)