యాలుకలు - ఉపయోగాలు

Telugu Lo Computer
0


నీరసాన్ని పోగొట్టి ఆకలిని పెంపొందించడంలో యాలుకలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.  వంటకాలలో సువాసన ద్రవ్యంగా ఉపయోగించబడే యాలుకలో ఔషధ గుణాలున్నాయి. దానిలోని గింజలు కూడా ఔషధల గుణాలను కలిగి ఉన్నాయి. 40 సంవత్సరాలు వాటిమీద పరిశోధనలు జరిగాయి. సువాసన కలిగిన యాలుక గింజలు కడుపు నొప్పిని నయం చేస్తాయి. జీర్ణ శక్తిని పెంపొందిస్తాయి. 

ఆయుర్వేద వైద్యంలో ఆస్తమా, డస్ట్ ఎలర్జీ, కిడ్నీలో రాళ్ళు, ఇంకా బలహీనతను పోగొట్టడంలో యాలుకలు ఉపయోగించబడుతున్నాయి. నోటి దుర్వాసనను పోగొట్టడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తోంది. మానసిక ఒత్తిడికి గురైన వారు యాలుకల "టీ" తాగితే ప్రశాంతతను పొందుతారు.

టీ పొడి తక్కువగానూ, యాలుక్కాయలు ఎక్కువగానూ కలిపి టీ తయారు చేస్తున్నపుడు వెలువడే సువాసనను ఆఘ్రాణించడం వల్ల, ఆ టీ తాగడం వల్ల కలిగే నూతనోత్సాహం వల్ల మానసిక ఒత్తిడి త్వరగా నయమైపోతుందట. 

నోటిలో నీరు ఊరడం, ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఏర్పడే తలనొప్పి, వాంతులు, ఊపిరితిత్తుల్లో కఫం మొదలైన సమస్యలకి యాలుక్కాయలను నోట్లో వోసుకుని నమలడంతోనే నివారణ లభిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)