అమ్మల మార్కెట్ !

Telugu Lo Computer
0


నిత్య ఘర్షణలతో  కునారిల్లే  మణిపూర్ లో మహిళలే నిర్వహిస్తున్న మార్కెట్. అతి ప్రాచీనమైన మార్కెట్, ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ .  మహిళల విజయానికి సాక్ష్యం మణిపూర్ లోని మదర్ మార్కెట్. 5 శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మార్కెట్ ను 5 వేలమంది మహిళలు నిర్వహిస్తున్నారు. అమ్మకాలు, వ్యాపార లావాదేవీలన్నింటినీ  కేవలం మహిళలే చూసుకుంటారు. తల్లిలాంటి ఈ మార్కెట్ మహిళా చైతన్యానికి  కేంద్రం. దీని పేరు ఇమాకెయిథెల్.  ఇది  ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్. ఇమా అంటే తల్లి అని అర్థం. కెయిథెల్ అంటే అంగడి. ఇక్కడ అన్ని స్టాల్స్ మహిళలే నిర్వ్హయిస్తారు.  ఈ మార్కెట్ మణిపూర్ రాజధాని  ఇంఫాల్ లో ఉంది. ప్రతిరోజూ కొన్ని వేల మంది వినియోగదారులతో  వర్తకం జరుగుతుంది. ఈ మార్కెట్ లో,  ఒక్క స్టాల్ లో కూడా పురుషులు లేకపోవడం విశేషం.

ఇక్కడి వ్యాపారాన్ని మహిళల స్వాతంత్ర్యాన్ని బలహీన పరచాలని  ఎన్నో శక్తులు ప్రయత్నించాయి. బ్రిటీష్ కాలంలో దోపిడీ విధానాన్ని సూపీలాల్ మహిళా పోరాటాలతో తిప్పికొట్టారు. స్వాతంత్ర్యానంతరం  1948-52 మధ్యకాలంలో అక్కడి ధనిక వర్గాల నుంచి ఈ మార్కెట్ కూలదోయాలనే ప్రతిపాదనకు సమ్మతి ఇవ్వమని ఒత్తిడి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటీష్, జపాన్ దళాలకు ఇంఫాల్ యుద్ధ భూమిగా మారినపుడు మాత్రమే ఈ మార్కెట్ పూర్తిగా మూసివేయబడింది. 2003 లో స్థానిక ప్రభుత్వం కెయిథిల్ స్థానే ఓ ఆదునిక సూపర్ మార్కెట్ నిర్మించాలని  వ్యూహం పన్నింది. కానీ, మహిళా వాణిజ్య సంఘం ఈ వ్యూహాన్ని తిప్పి కొట్టింది. ఈ స్థలం ఎప్పుడూ భిన్న ఆచారాలు, సంప్రదాయాలు, తెగలకు చెందిన మహిళల తోనూ, ప్రపంచంలో వివిధ దేశాలకు చెందిన పర్యాటలకులతోనూ  నిండి ఉంటుంది. సెంటర్ ఫర్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ 2005 రిపోర్ట్ లో కెయిథిలో కేవలం వర్తక కేంద్రం మాత్రమే కాదు. సాంఘిక, రాజకీయ అంశాలకు సంబంధించిన  అభిప్రాయాల మార్పిడి జరిగే స్థలం కూడా అని తెలియచేసింది. భోజన సమయంలోనూ, విశ్రాంతి సమయంలోనూ ఇక్కడి మహిళలు సాంఘిక రాజకీయ అంశాలను చర్చిస్తూ ఉంటారు. ఈ విధమైన సమాచార స్రవంతి  వీరిని ఎప్పుడూ జాగరూకతతో  ఉంచేందుకు  తోడ్పడుతోంది. ఇక్కడి మహిళలు కేవలం వ్యాపార నిర్వాహకులే కాదు నాయకత్వ లక్షణాలకు, విప్లవ భావాలకు ప్రత్యక్ష ఉదాహరణగా  చెప్పొచ్చు. 

మార్కెట్‌లో వ్యాపారం చేసుకునే దాదాపు 300 మంది మహిళలకు లైసెన్సులు లేవు. వీరిలో చాలా మంది ఎన్‌కౌంటర్‌లో చని పోయిన వారి భార్యలే కావడం విశేషం. వీరే కాకుండా మార్కెట్‌లోని మహిళల్లో దాదాపు 20 శాతం మంది కుటుంబ పెద్దను కోల్పో యిన వారే ఉన్నారు. తమకు లైసెన్సులు ఇప్పించాలని ఇప్పటికే చాలా మంది అధికారులకు మొరపెట్టుకున్నా లాభం లేకపోయిందని, ఈ విషయంలో రాజకీయ నాయకులు కూడా తమకు ఏ మాత్రం సహకరించడం లేదని ఈ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లైసెన్స్‌ లేకపోతే మార్కెట్‌లో తాము వ్యాపార లావాదేవీలు సాగించలేమనీ, తమ కుటుం బాలు వీధిన పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా తమకు లైసెన్సులు ఇప్పించాలని వీరు కోరుతున్నారు. అంతేకాకుండా ఈ మార్కెట్‌లో తొమ్మిది శాతం మైనార్టీ మహిళలకు  కేటాయించాలని స్థానిక మహిళలు  కోరుతున్నారు. 

మార్కెట్‌ నిర్వహించే మహిళలకు రాజ కీయాల మీద ఆసక్తి ఎక్కువే! మధ్యాహ్న సమ యంలో భోజనం చేసేటప్పుడు, ఆ తరువాత రాష్ట్ర రాజ కీయాల గురించి సుదీర్ఘ చర్చలు జరుగు తాయి. ఎన్నికల సమయంలో అయితే ఏ పార్టీకి ఓటు వేస్తే తమకు ప్రయోజనం చేకూరుతుందో కూడా కొన్ని సార్లు భోజనాల సమయంలోనే నిర్ణయించేసు కుంటారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఎక్కువగా ఈ మార్కెట్‌ మీద దృష్టి పెడు తుంటారట! ఇక్కడ మహిళల ఓట్లు దోచు కోవడానికి రాజకీయ పార్టీలు పడరాని పాట్లు పడుతుంటాయి. ఎవరెన్ని హామీలు ఇచ్చినా తమ సమస్యల మీద దృష్టి సారించేవారికే తాము ఓటు వేస్తామని వీరు చెబుతారు.

Post a Comment

0Comments

Post a Comment (0)