నిలకడగాపెట్రోల్‌ ధరలు

Telugu Lo Computer
0


దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో పదిహేను రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నిలకడగానే ఉన్నాయి. గత రెండు నెలలుగా భారీగా ధరలు పెరగగా.. కొంతకాలంగా ఎలాంటి మార్పు కనిపించకపోవడం కాస్త ఊరటనిస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోలు ధర రూ.100 దాటగా, మిగతా రాష్ట్రాల్లోనూ సెంచరీకి చేరువగా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్‌ రూ. 101.84గా, డీజిల్‌ ధర లీటర్‌కు రూ.89.87గా ఉంది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ ధరల ప్రకారం.. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో అధికంగా లీటర్‌ పెట్రోల్‌ రూ.107.83గా, డీజిల్ రూ.97.45 గాను ఉంది. ఇప్పటివరకు నాలుగు మెట్రో నగరాల్లోని రేట్లను పోల్చినట్లయితే ముంబయిలోనే ధరలు అత్యధికంగా ఉన్నాయని చమురు శుద్ధి సంస్థ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)