పీవీ సింధుకు కాంస్యం

Telugu Lo Computer
0


టోక్యో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఈ మెగా ఈవెంట్‌లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళగా నిలిచింది. ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్‌లో సింధు 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. దీంతో సింధు ఖాతాలో మరో బ్రాంజ్ మెడల్ చేరింది. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ సింధు సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియాకు ఇది రెండో మెడల్‌. తొలి మెడల్‌ను వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను అందించిన విషయం తెలిసిందే. ఇక బాక్సర్ లవ్లీనా ఇప్పటికే మరో మెడల్‌ను కూడా ఖాయం చేసింది. సింధు కంటే ముందు రెజ్లర్ సుశీల్‌కుమార్ మాత్రమే ఒలింపిక్స్‌లో భారత్ తరఫున రెండు మెడల్స్ గెలిచాడు. అతడు 2008 గేమ్స్‌లో బ్రాంజ్‌, 2012 గేమ్స్‌లో సిల్వర్ మెడల్‌ గెలిచిన విషయం తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)