కర్మ- భోగము - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Monday, 23 August 2021

కర్మ- భోగము


మనకు పూర్వ జన్మ కర్మల వలననే ఈ జన్మలో, తల్లి, తండ్రి, అన్న, అక్క, భార్య, భర్త , ప్రేమికుడు, ప్రియురాలు, మిత్రులు, శత్రువులు మిగతా సంభంధాలు ఈ ప్రపంచంలో మనకు లభిస్తాయి. ఎందుకంటే మనం వీళ్లకు ఈ జన్మలో ఏదో ఒకటి ఇవ్వ వలసి, లేదా తీసుకొన వలసి రావచ్చును. మనకు సంతాన రూపంలో ఎవరెవరు వస్తారుమనకు పూర్వ జన్మలో సంబంధం వున్న వాళ్ళే ఈజన్మలో సంతాన రూపంలో జన్మిస్తారు, అవ్వే మన శాస్త్రాల ప్రకారం నాలుగు రకాలుగా వున్నట్లు చెబుతారు...

* ఋణానుబంధం:- గత జన్మలో మనం ఎవరి వడ్డయినా రుణం తీసుకుని వుండచ్చు లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్ట పరచి వుండచ్చు. అటువంటి వాళ్ళు మీకు సంతాన రూపంలో జన్మించి లేదా ఏదైనా వ్యాధి రూపం లో వచ్చి మీ వద్ద వున్న పూర్తి ధనం ఖర్చు అయ్యే వరకూ వుండి ఆ పాత ఖర్చులు సరి సమానం అయ్యేవరకు మనతోనే వుంటారు.

* శత్రువులు - పుత్రులు:- మన పూర్వ జన్మలో శత్రువులు మన పై వారు తమ తమ కక్షను తీర్చుకోవటానికి మన ఇంట్లో సంతాన రూపం లో తిరిగి పుడతారు. అలా పుట్టితల్లి తండ్రులతో పెద్దయ్యాక కొట్లాటలు, నానా గొడవలూ చేస్తారు. జీవితమంతా ఏదో ఒక విషయంలో ఏడిపిస్తూనే వుంటారు. ఎల్లప్పుడును తల్లితండ్రులను నా నా యాతనా పెడుతూ వాళ్ళ పరువు తీసి వాళ్ళను దుఃఖితునలు చేస్తూ ఆనందపడుతూంటారు.

*  తటస్థ పుత్రులు :- వీళ్ళు ఒక వైపు తల్లి తండ్రులకు సేవ చెయ్యరు...మరో వైపుసుఖంగా కూడా వుంచరు, వాళ్ళను వాళ్ళ మానానికి వాళ్ళను వదిలేసి వెళ్తారు. వాళ్ళ వివాహానంతరం తల్లి తండ్రులకు దూరంగా జరిగి పోతారు.

*  సేవా తత్పరత వున్న పుత్రులు:- గత జన్మలో మీరు ఎవరికైనా బాగా సేవచేసి వుండవచ్చును, ఆ రుణాన్ని తీర్చుకోవటానికి కొడుకు లేదా కుతూరు రూపంలో ఈ జన్మలో వస్తారు. అలా వచ్చి బాగా సేవను చేస్తారు. మీరు గతం లో ఏది చేసుకున్నారో ఇప్పుడు అదే సంప్రాప్తిస్తుంది. మీరు గత జన్మలో ఎవరికైనా సేవ చేస్తే, ఈ జన్మలో మన ముదుసలి తనం లో మనకు సేవ చేస్తారు. లేకపోతే మనకు వృద్ధాప్యంలో గుక్కెడు నీళ్లు పోసే వారుకూడా మనవద్ద వుండరు.

ఇది పూర్తిగా మనుష్యులకు మాత్రమే అమలు అవుతుంది అని అనుకోవద్దు. ఈ క్రింద చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగా నైనా పుట్టవచ్చును. ఒకవేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి వుండవచ్చును వాళ్ళే కొడుకు లేదా కూతురుగా మీ ఇంట పుట్టవచ్చును. ఒక ఆవుకి తన దూడకు సమంగా పాలు తాగనియ్యాకుండా దూరంగా వుంచిన పాపానికి వాళ్ళే కొడుకు లేదా కూతురు గా మీ ఇంట పుడతారు. లేదా మీరు ఏదైనా నిరపరాధి జీవిని సతాయించారనుకో, వాళ్ళు మీకు శత్రువు రూపంలో పుట్టి మీ తో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చుకుంటారు.

అందుకనే జీవితంలో ఎవరికీ కూడా కీడు,చెడు చెయ్యవద్దు. ఎందుకనగా ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏది చేస్తే దానికి ఈ జన్మలో లేదా వచ్చే జన్మలో నూటికి నూరు శాతం ఎక్కువ చేసి అనుభవంలో కి తెస్తుంది.  మీరు ఒక వేళ ఎవరికైనా ఒక్క రూపాయి దానం చేస్తే అది మీ ఖాతా లో నూరు రూపాయలు గా జమ చెయ్య బడతాయి. ఒకవేళ మీరు ఎవరి వద్దయినా ఒక్క రూపాయి లాక్కుంటే మీ ఖాత నుంచి నూరు రూపాయలు తీసివేయబడతాయి. (అనగా పాప పుణ్యాలు)

కొద్దిగా ఆలోచించండి " మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చుకున్నారు, మళ్లి  ఎంత ధనాన్ని మీ వెంట తీసుకెళ్తారు ?.ఇప్పటివరకు పొయినవాళ్లు ఎంత బంగారం, వెండి పట్టికుపోయారు ? మీరు పోయె ముందు మీ బ్యాంకు లోఉన్న నగా, నట్ర, డబ్బు మూలుగుతుందో అదిపూర్తిగా పనికి రాని సంపాదన కదా. ఒకవేళ మీ మీ సంతానం సమర్ధులైతే మీరు వదిలిన డబ్బు దస్కం వాళ్లకు అనవసర వస్తువు కదా. వాటి అవసరం వాళ్లకు లేదు కదా. వొక వేళ వాళ్ళు ఆ డబ్బు దస్కం వాడుకున్నట్లయితే వాళ్ళు ఎందుకూ కొరగాని వాళ్ళుగా, చేతకాని వాళ్ళుగా అయిపోతారు కదా. వాళ్ళు సదరు డబ్బు, నగా నట్రా వాడుకుని కొద్ది రోజుల్లోనే వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుని తీరుతారు. ఆ తర్వాతే వాళ్లకు శాంతి లభిస్తుంది.

నేను, నాది, మీది అన్నది అంతా ఇక్కడికి ఇక్కడే పనికి రాకుండా పోతుంది. ఏది కూడా వెంట రాదు. ఒకవేళ మీ వెంటవస్తే గిస్తే మీ పుణ్య ఫలం వెంట వస్తుంది. కావున ఎంత వీలయితే అంత మంచికర్మలు చెయ్యండి.

No comments:

Post a Comment

Post Top Ad