అనుమానంతో స్నేహితుని హత్య - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Thursday, 19 August 2021

అనుమానంతో స్నేహితుని హత్య


తెలంగాణ రాష్ట్రం లోని యదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలంలోని  కొరటికల్‌కు చెందిన పెద్దిటి అశోక్‌రెడ్డి, చిన్నం అర్జున్, బండ సురేష్‌ స్నేహితులు. అశోక్‌రెడ్డి అదే మండలం మోదుగుగూడెం గ్రామానికి చెందిన శిరీషను 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అశోక్‌కు తన స్నేహితుడు చిన్న అర్జున్ చాలా నమ్మకం ఉండేది. వారు తరుచూ ఇంటికి వస్తుండేవారు. అశోక్ తన ఇంట్లోనే అర్జున్‌తో కలిసి మద్యం తాగేవాడు. అయితే కొన్ని నెలల కిందట తన భార్య శిరీషతో అర్జున్ మాట్లాడటం అశోక్ గమనించాడు. ఆ తర్వాత అర్జున్‌పై అశోక్ అనుమానం పెంచుకున్నాడు. అర్జున్ తన భార్యతో మాట్లాడటం జీర్ణించుకోలేకపోయాడు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అర్జున్‌ను హత్య చేయాలని నిర్ణయానికి వచ్చాడు. ఇందుకు మరో స్నేహితులు సురేష్ సాయం కోరాడు. తన భార్యతో అర్జున్ వివాహేతరం సంబంధం నడుపుతున్నాడని.. అతన్ని హత్య చేసేందుకు సహకరించాలని సురేష్‌ను అడిగాడు. అలాగే తన బంధువులు నర్సింహ, నవీన్‌కు కూడా ఇలాగే చెప్పి.. తనకు సహకరించాలని కోరాడు. అందుకు వారు కూడా సరే అన్నారు. దీంతో అర్జున్‌ను హత్య చేసేందుకు అశోక్ ప్లాన్ సిద్దం చేశాడు. ఈ క్రమంలోనే అర్జున్ కదలికలపై నిఘా ఉంచారు. ఈ నెల 14న వారి ప్లాన్‌ను అమలు చేశారు. అర్జున్ వద్దకు వెళ్లిన సురేష్.. మందు తీసుకుని అశోక్‌రెడ్డి షెడ్డు వద్దకు రావాలని చెప్పాడు. అయితే అర్జున్ అక్కడికి చేరుకునే సమయంలో అశోక్, సురేశ్, నర్సింహ, నవీన్‌తో పాటు మరో వ్యక్తి మల్లెమాల శ్రీశైలం అతనిపై దాడి చేశారు. కర్రలతో విచక్షణరహితంగా అర్జున్‌పై దాడి చేసి హత్య చేశారు. అనంతరం అతడు మృతిచెందినట్టుగా నిర్ధారించుకున్న అనంతరం.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

No comments:

Post a Comment

Post Top Ad