భోజనం చేయటానికి ఉపయోగపడే ఆకులు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Tuesday, 17 August 2021

భోజనం చేయటానికి ఉపయోగపడే ఆకులు

కొంతకాలం క్రితం ఒక గ్రామంలో  బాలురు తీవ్రమైన అతిసార వ్యాధితో బాధపడుతున్నారు. వారికి ఎంత మంచి చికిత్స అందించినా  వ్యాధి తీవ్రత తగ్గటం లేదు . వారిని పరిశీలించటానికి వచ్చిన శాస్త్రవేత్తలు వారు ఆహారం తీసికోవడానికి  ఉపయోగిస్తున్న  అల్యూమినియం పాత్రలను ప్రయోగశాలకు పంపినప్పుడు వారి రోగానికి కారణం వారు తినే ఆహారం కాదు, వారు వండటానికి ఉపయోగింస్తున్న అల్యూమినియం పాత్రలేనని నిర్దారణకు వచ్చారు. ఈ అల్యూమినియం పాత్రలో  వండే  ఆహారం విషపూరితం అవుతుంది. అది శరీరం పైన ఒక్కసారిగా తన ప్రభావాన్ని చూపించదు. కొంచెం కొంచెంగా మనిషి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. 

అల్యూమినియం పాత్రలో  ఆహారాన్ని ఉడికించడం వలన ఆహారం లోని  ఆమ్లములు , అల్యూమినియం లోహము పైన ప్రభావం చూపి అనేక విషసంబంధ రోగాలకు ప్రధానకారణం అవుతాయి. ముఖ్యంగా చర్మ సంబంధ , నరాల సంబంధ సమస్యలు అధికంగా వస్తాయి.  శరీరం నందు కేన్సర్ కూడ వృద్ధిచెందుతుంది. 

పైన చెప్పినటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగా మనం ఆహారాన్ని వండే వంట పాత్రలను మార్చాలి.  అదే విధముగా మనం ఆహారాన్ని భుజించుటకు విస్తరాకులు వాడటం ఎంతో మంచిది . 

* అరటి ఆకు -

అరటి ఆకు భుజించటం మిక్కిలి శ్రేష్టం. కఫవాతములను హరించును . బలమును , ఆరోగ్యమును పెంచును. శరీరకాంతిని , సంభోగ శక్తిని పెంచును. ఆకలిని , దంతకాంతిని కలిగించును. పైత్యశాంతిని కలుగచేయును . శ్లేష్మ సంబంధ దోషాలు పోవును . శరీరం నొప్పులు తగ్గించును . ఉదరము నందలి పుండ్లు అనగా పెప్టిక్ అల్సర్ ను నయం చేయును .

* మోదుగ ఆకు 

మోదుగ ఆకులో భుజించుటచే గుల్మరోగం , మహోదరం , క్రిమిరోగం , రక్తసంబంధ రోగాలు , పిత్తరోగములు నశించును. బుద్దిని పెంచును.

* మర్రి ఆకు 

మర్రి ఆకు భుజించిన క్రిమి రోగ నివారణ , జఠరాగ్ని వృద్ది , కుష్ఠు వ్యాధి నివారణ అగును. నేత్రదోష నివారణ అగును. వీర్యవృద్ధి కలుగును.

* పనస ఆకు 

పనస  విస్తరి యందు భుజించిన అగ్నివృద్ధి , పిత్తహర గుణములు ఉండును.

* రావి ఆకు 

రావి పిత్తశ్లేష్మ నివారణ , అగ్నివృద్ది కలిగించును. వీర్యవృద్ధి కలుగచేయును . విద్యార్జనకు మనసు కలుగచేయును .

* వక్క వట్ట ఆకు 

ఇది అగ్నివృద్ధిని కలుగచేయును . వాత,పిత్త రోగాలని హరించును .

పైన చెప్పిన ఆకులలో భోజనం చేయడం వలన ఆయా ఆకులలో ఉండు ఔషధ గుణాలు అన్నియు మన శరీరం నందు చేరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును.

No comments:

Post a Comment

Post Top Ad