ప్రకాశ్‌రాజ్‌ చేతికి సర్జరీ

Telugu Lo Computer
0


చెన్నైలో 'తిరుచిత్రంబళం' సినిమా షూటింగ్‌లో గాయపడిన విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు మంగళవారం రాత్రి సర్జరీ పూర్తయింది. ఈ మేరకు ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు ఓ ట్వీట్‌ చేశారు. ''డెవిల్‌ ఈజ్‌ బ్యాక్‌. సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. నాపై ప్రేమ చూపించి ప్రార్ధించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. త్వరలో యాక్షన్‌లో దిగుతా'' అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ధనుష్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో ప్రకాశ్‌రాజ్‌ గాయపడిన సంగతి తెలిసిందే! చేతికి బలమైన గాయం కావడంతో సర్జరీ కోసం మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ సన్‌షైన్‌ ఆసుపత్రికి చేరుకున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన త్వరలో జరగబోయే 'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే!

Post a Comment

0Comments

Post a Comment (0)