సీజేఐ సంచలన వ్యాఖ్యలు

Telugu Lo Computer
0


మన దేశంలో కస్టోడియల్ టార్చర్, ఇతర పోలీసు దుశ్చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్‌ నుంచి ప్రత్యేక అధికారాలు కలవారికి సైతం మినహాయింపు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా పోలీసులకు మానవ హక్కులపై అవగాహన కల్పించాలని జాతీయ న్యాయ సేవల అథారిటీ (నల్సా)ను కోరారు. నల్సా మొబైల్ యాప్‌ను, 'విజన్ అండ్ మిషన్ స్టేట్‌మెంట్‌'ను ఆయన ఆవిష్కరించారు. నల్సా ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ రమణ మాట్లాడుతూ, మానవ హక్కులకు, శారీరక భద్రతకు ముప్పు పోలీస్ స్టేషన్లలో అత్యధికంగా ఉందన్నారు. పోలీసు కస్టడీలో నిర్బంధంలో ఉన్నవారిపై హింస, ఇతర పోలీసు దుశ్చర్యలు నేడు మన సమాజంలో ఇంకా కొనసాగుతున్న సమస్యలని చెప్పారు. రాజ్యాంగపరమైన ప్రకటనలు, హామీలు ఉన్నప్పటికీ, పోలీస్ స్టేషన్లలో సమర్థవంతమైన న్యాయ ప్రాతినిధ్యం లేకపోవడం అరెస్టయినవారికి, నిర్బంధంలో ఉన్నవారికి అత్యంత తీవ్ర నష్టదాయకమని చెప్పారు. ఇటీవల వస్తున్న వార్తలను పరిశీలించినపుడు ప్రత్యేక అధికారాలు కలవారికి సైతం థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్‌ నుంచి మినహాయింపు ఉండటం లేదన్నారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణమ రాజుపై ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ కస్టడీలో దాడి జరిగినట్లు వచ్చిన ఆరోపణలను పరోక్షంగా ప్రస్తావించినట్లు కనిపించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)