హేమకు షోకాజ్‌ నోటీసులు

Telugu Lo Computer
0


మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ‘మా’ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నానంటూ ప్రకటించిన నటి హేమకు తాజాగా షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌ నిధులు దుర్వినియోగం చేశారంటూ నటి హేమ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సభ్యులతో హేమ మాట్లాడిన వాయిస్ రికార్డ్ బయపడింది. దీనిపై స్పందించిన నరేశ్‌.. హేమ వ్యాఖ్యలను తప్పుపట్టారు. అసోసియేషన్‌ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని.. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో హేమకు క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)