మౌలిక వసతులు విక్రయిస్తాం : నిర్మలా సీతారామన్

Telugu Lo Computer
0


నిధుల సమీకరణ కోసం మౌలిక వసతులను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్, గ్యాస్‌పైప్‌లైన్‌లను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మొత్తం రూ.6 లక్షల కోట్ల నిధుల సేకరించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు ఆమె తెలిపారు. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఆస్తుల విక్రయాలు చేపట్టినట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. నిర్ధిష్ట కాలానికి ఆస్తుల అమ్మకం ద్వారా నిధుల సమీకరణను చేపట్టనున్నట్టు ఆమె చెప్పారు. కీలక రంగాలు మినహా మిగతా రంగాలను ప్రైవేటికరించాలని నిర్ణయించినట్లు సీతారామన్ ప్రకటించారు. ఆస్తుల యాజమాన్య హక్కులు మాత్రం ప్రభుత్వానికే ఉంటాయని ఆమె స్పష్టంచేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)