గియార్దనో బ్రునో

Telugu Lo Computer
0

ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కొపర్నికస్ ప్రతిపాదించిన సూర్యకేంద్రకం సిద్దాంతం మద్య యుగాలఛాందస మత విశ్వాసాలపైన చారుదెబ్బ తీసింది. మతం చెప్పే భగవత్ సృష్టి  క్రమాన్నీ. భూమి విశ్వానికి కేంద్రంగానూ స్థిరంగానూ వుండగా సూర్యుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నాడన్న మతవాద భూకేంద్రిక సిద్దాంతాన్ని యీ సూర్య కేంద్రక సిద్దాంతం దెబ్బతీసింది. ఇటాలియన్ శాస్త్రవేత్త గియార్దనో బ్రునో విఙ్ఞానశాస్త్ర ఆవిష్కరణలను ప్రత్యేకించి కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్దాంతాన్ని ఆధారం చేసుకొని బౌతికవాద ప్రాపంచిక దృక్పథాన్ని చురుగ్గా ప్రచారం సాగించాడు. విశ్వం (ప్రకృతి) అనంతమైనదిగా పేర్కొంటూ అతడు కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్దాంతంలోని లోపాలను సరిదిద్ద ప్రయత్నించాడు. మత విశ్వాసాలకు వ్యతిరేకంగా అతడు సాగించిన ప్రచారం వలన చర్చీ ఆగ్రహనికి గురయ్యాడు. అంధ మత విశ్వాసాలను తలదాల్చి శాస్త్రీయ చింతనను వదులుకోటానికి బదులుగా ఎనిమిదేళ్ళ కారాగారవాసాన్నీ సజీవ దహన్నాన్ని ఎంచుకున్న సాహసి బ్రునో. ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియో ఆవిష్కరణలు కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్దాంతానికి మద్దతుగా నిలిచాయి. ఇంగ్లీషు శాస్త్రవేత్త, బౌతికవాద తత్వవేత్త ఫ్రాన్సిస్ బేకన్ ప్రయోగాత్మక విఙ్ఞాన శాస్త్రానికి పునాదులు వేశాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)