కళ్లు చిదంబరం

Telugu Lo Computer
0


కళ్లు చిదంబరం అసలు పేరు కొల్లూరి చిదంబరం. 1945, అక్టోబర్ 10 న విశాఖపట్నంలో జన్మించారు.ఆయన కళ్లు చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లో తెరంగేట్రం చేశారు.తన మొదటి సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకుని కళ్లు చిదంబరంగా గుర్తింపు పొందారు. ఆయన 300లకు పైగా సినిమాల్లో నటించారు. కళ్లు, అమ్మోరు, చంటి, గోల్‌మాల్ గోవిందం (1992), మనీ, పెళ్ళిపెందిరి, పవిత్రబంధం, పెళ్ళి చేసుకుందాం (1997), ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్ 1 విడుదల, గోవిందా గోవిందా, అనగనగా ఒక రోజు, అదిరిందయ్యా చంద్రం, అడవిచుక్క (2000), తొలిపరిచయం, చంటిగాడు (2003), ఐతే ఏంటి (2004), అతడెవరు (2007) తదితర చిత్రాల్లో నటించారు. ప్రత్యేకమైన పాత్రలు పోషించి గుర్తింపు పొందారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2015, అక్టోబరు 19 సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు.

Post a Comment

0Comments

Post a Comment (0)