మిథునం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Monday, 23 August 2021

మిథునం !ఆ వృద్ధ మిధునం వయసుడిగినా

చిలుకా గోరొంకలే

కష్ట సుఖాలు కావిడి కుండలై జంటగా మోసి పరిణతి చెంది

నేడు అలిసి సొలిసిన ముచ్చటైనగువ్వ ద్వయం..ఇపుడు వీడని తోడూ-నీడలై
చేరినారు జీవిత చరమాంకం...
అన్యోన్య సంసారంలో పండిన ఆత్మానుబంధపు "నవ్వుపువ్వులే "
వారి జీవన ఋతు రాగాల ఆలాపనా గమకాల సందళ్ళు....
ఒకరికొకరై వడ్డించుకున్న మాధుర్యాలే వారి ఉల్లాస సొగసులు..
జంట పావురాలై "ఈ జీవన సంధ్య లో" ఒకరికొకరు ఊతమై
ఒకరి ఉనికి ఒకరికి "రామ రక్షై " ,ఒకరి సాన్నిధ్యం ఒకరికి రమణీయ
బృందావనమై , త్యాగమూర్తు లై....
అనురాగ ముడులు వేసుకుంటూ
,ఆనందాలు విరబూయించుకుంటూ
వార్ధక్య పర్వం మోహనంగా శృతి చేసుకుని పలికించుకుంటు
సరసాలు.,విందులు,రుచులు,
.సల్లాపాలు
సంబరాల అన్యోన్యత పండించుకుంటూ
గుంభనగా మిళితమై పోయిన ఆదర్శజీవులు ..ప్రేమికులైన ఆలుమగలు
ఒకరి శ్రేయస్సు, ఆనందం రెండవ వారి ఊపిరిగా , గుండె చప్పుళ్లుగా
ఒకరి నడత, చైతన్యం .మరొకరికి ఉత్తేజ పూరిత ఆహ్లాదంగా..
ఎనభైలో కూడా ఇరవైలుగా ..
సరస సంభాషణలు ,హాస్యపు జల్లులు
కుమ్మరించుకుంటూ ..మనోహర జీవనానికి సదా అధినేతలై
"నిన్ను నిన్ను గా ప్రేమిస్తూ "...నేనున్నా " అని ప్రేమతో చేయందిస్తూ
పాలు-నీరై కలిసిపోయిన ఆ ప్రేమ మిధునాల జీవితం సుందరం సుమధురం అపురూప అలోకిక ఆనందం

No comments:

Post a Comment

Post Top Ad