సామెతలు ...!

Telugu Lo Computer
0


* గుంపులో గోవిందా !

* కోడలికి బుధ్ధి చెప్పి అత్త తెడ్డి నాకింది!

* కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం!

* కోల ఆడితేనే కోతి ఆడుతుందన్నట్లు!

* కోస్తే తెగదు కొడితే పగలదు!

* కల్ల పసిడికి కాంతి మెండు!

* గంజి తాగేవానికి మీసాలు ఎగబట్టేవాడొకడన్నట్టు!

* గంతకు తగ్గ బొంత!

* గాజుల బేరం భోజనానికి సరి!

* గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన!

* గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట!

* గారాబం గజ్జెలకేడిస్తే, వీపు గుద్దులకేడ్చిందంట!

* గుండ్లు తేలి... బెండ్లు మునిగాయంటున్నాడట!

* గుడ్డి కన్నా మెల్ల నయము కదా!

* గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు!

Post a Comment

0Comments

Post a Comment (0)