సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Sunday, 8 August 2021

సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్

1 వ్యక్తి, లోపలి ప్రదేశం చిత్రం కావచ్చుసర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్  స్కాట్లండు కు చెందినవాడు. లండను లోని మేరీ మెడికల్ కాలేజీ నుంచి 1906 లో ఈయన డిగ్రీ తీసుకున్నారు. అక్కడే కొంతకాలం పాటు బాక్టీరియా లను నిరోధించే పదార్థాలపై పరిశోధనలు చేశాడు. అక్కడ నుంచే ఆర్మీ మెడికల్ కోర్ కి వెళ్లి, మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా 1918 లో మళ్ళీ సెయింట్ మేరీ మెడికల్ కాలేజీకి వచ్చి వేశాడు. ఆంటీ బయాటిక్స్ మీద పరిశోధనలు మాత్రం విడువకుండా చేసేవాడు. ఫలితంగా 1928 లో పెన్సిలిన్ ను రూపొందించగలిగాడు.
చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు... ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసి పనిలో చేరాడు. ఇరవై ఏళ్ల వయసులో తిరిగి చదువు మొదలెట్టి శాస్త్రవేత్త అయ్యాడు.గడ్డురోగాల నుంచి ప్రాణాలు కాపాడే మందు కనిపెట్టి మహోపకారం చేశాడు.
వెయ్యేళ్ల కాలంలోనే అతి గొప్ప ఆవిష్కరణగా, కోట్లాది మంది ప్రాణాలకు రక్షణగా గుర్తింపు పొందింది 'పెన్సిలిన్‌'. తొలి యాంటీ బయోటిక్‌గా పేరొందిన ఆ మందును కనిపెట్టిన శాస్త్రవేత్తే అలగ్జాండర్‌ ఫ్లెమింగ్‌. వేరే ప్రయోగం చేస్తుండగా జరిగిన చిన్న పొరపాటు వల్ల ఇది బయటపడడం విశేషం. పెన్సిలిన్‌ వల్ల క్షయ, న్యూమోనియా, టైఫాయిడ్‌ లాంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి మానవాళికి రక్షణ కలుగుతోంది. దీన్ని కనిపెట్టినందుకు ఫ్లెమింగ్‌ 1945లో నోబెల్‌ బహుమతిని పొందారు.
బ్యాక్టీరియా పై పరిశోధన
మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడంతో సైనికులకు చికిత్సలు చేసే బృందానికి నాయకత్వం వహించాడు. గాయాలకు సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్‌ సోకి చాలా మంది సైనికులు చనిపోవడాన్ని గమనించిన ఫ్లెమింగ్‌, యుద్ధానంతరం బ్యాక్టీరియాపై పరిశోధనలు చేయసాగాడు. వాటిలో భాగంగా 'స్టెఫైలో కోకి' (Staphylococci) సూక్ష్మజీవులపై పరిశోధన చేస్తుండగా ఓ రోజున చిన్న పొరపాటు జరిగింది. ఆ బ్యాక్టీరియా ఉన్న పాత్రలను బల్లపై పెట్టి మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు వచ్చి చూస్తే బయటి వాతావరణం ప్రభావం వల్ల ఓ పాత్రలో నీలిరంగులో బూజులాంటి తెట్టు (ఫంగస్‌) కట్టి ఉండడం గమనించాడు. చిత్రంగా ఆ బూజు ఆశించినంత మేరా పాత్రలో సూక్ష్మజీవులు నాశనమై కనిపించాయి. అంటే ఆ బూజులో సూక్ష్మజీవులను చంపే పదార్థమేదో ఉందన్నమాట! దాంతో ఫ్లెమింగ్‌ దానిపై పరిశోధనలు చేసి చిన్న కుంచెలాగా ఉండే పదార్థాన్ని వేరుచేయగలిగాడు. లాటిన్‌లో పెన్సిలియమ్‌ అంటే చిన్న కుంచె అనే అర్థం ఉండడంతో దానికి 'పెన్సిలిన్‌' అని పేరు పెట్టాడు. దాన్ని 1928లో కనిపెట్టగా, మరిన్ని పరిశోధనలు చేసి ఓ మందుగా మార్చి వాడుకలోకి తీసుకు రావడానికి 17 సంవత్సరాలు పట్టింది. దీంతో యాంటీబయాటిక్‌ యుగానికి నాంది పలికినట్టయింది.
*ఫ్లెమింగ్, ఫ్లోరే, చైన్ సంయుక్తంగా 1945 లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.
*ఫ్లెమింగ్ కు రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండు హంటేరియన్ ప్రొఫెసర్ హోదాను ఇచ్చింది.
*ఫ్లెమింగ్ కు 1944 లో జార్జి VI మహారాజు నైట్ బాచెలర్(Knight  Bachelor) మెడల్ ను బహుకరించాడు.
*1999 లో టైమ్ మ్యాగజైన్ 20వ శతాబ్దపు 100 మంది ప్రముఖ వ్యక్తులలో ఒకడిగా గుర్తించింది.
*2002 లో ఫ్లెమింగ్ ను బి.బి.సి. 100 మంది ప్రముఖ బ్రిటిష్ వ్యక్తులలో ఒకడిగా ఎన్నిక ద్వారా నిర్ణయించింది.

No comments:

Post a Comment

Post Top Ad