క్యాన్సర్‌తో శరణ్య శశి మృతి

Telugu Lo Computer
0

 

కేరళకు చెందిన ప్రముఖ సినీ, బుల్లితెర నటి శరణ్య శశి (35) అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్నేళ్లుగా క్యాన్సర్‌ (బ్రెయిన్‌ ట్యూమర్‌) తో బాధపడుతున్న ఆమె తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం దృష్ట్యా 11 సార్లు శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సి రావడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆమె స్నేహితులు, శ్రేయోభిలాషులు నిధులు సమీకరించారు. అయితే మేలో ఆమెకు కరోనా సోకడంతో ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. వైరస్‌ నుంచి కోలుకున్నా నిమోనియా, శ్వాస సంబంధ సమస్యలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే తనువు చాలించింది. కన్నూర్‌ జిల్లాలోని పళయంగడికి చెందిన శరణ్య ‘చాక్కో రండమన్‌’, ‘చోటా ముంబయి’ లాంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మంత్రకోడి’, ‘సీత’, ‘హరిచందనం’ లాంటి సీరియళ్లతో బుల్లితెరపై ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. క్యాన్సర్‌పై ధైర్యంగా పోరాడి ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. లాక్‌డౌన్‌ సమయంలో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించి వంటల్లో తన నైపుణ్యాన్ని చూపించారు. ఆమె మృతిపట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సంతాపం వ్యక్తం చేశారు. కేరళలో వరదలు సంభవించినప్పుడు తాను వైద్యానికి దాచుకున్న డబ్బులో కొంత భాగాన్ని విరాళం ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)