తమిళ రైతుల్ని అడ్డుకున్న పోలీసులు

Telugu Lo Computer
0


ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుగా తరలివచ్చిన  అన్నదాతల్ని పోలీసులు అడ్డుకున్నారు. ముందుకు వెళ్లకుండా నిరోధించారు. దీంతో రైతులు అక్కడే సమావేశం నిర్వహించారు. గత ఎనిమిది నెలల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న రైతులుకు సంఘీభావం తెలపడానికి తమిళనాడు, పాండిచ్చేరి, ఇతర రాష్ట్రాల నుంచి గురువారం రైతులు, కార్మికులు తరలివచ్చారు. తమిళనాడు నుంచి ఐఎకెఎస్‌ ఆధ్వర్యంలో వెయికి పైగా రైతులు గురువారం ఢిల్లీకి తరలివచ్చారు. వీరిలో భారీ సంఖ్యలో మహిళలు కూడా ఉన్నారు. పార్లమెంట్‌ వైపు మార్చ్‌గా వెళుతున్న వీరిని పోలీసులు అడ్డగించారు. దీంతో అడ్డగించే చోటే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎఐకెఎస్‌ ప్రధాన కార్యదర్శి, అధ్యక్షులు అశోక్‌ ధవాలే, ఉపాధ్యక్షులు కె బాలకృష్ణన్‌, ఎంపిలు ఎస్‌ వెంకటేశన్‌, పిఆర్‌ నటరాజన్‌, వి శివదసన్‌, ఎఐఎ డబ్ల్యూయు ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ పాల్గొన్నారు. 9న సేవ్‌ ఇండియా, క్విట్‌ కార్పొరేట్‌ బ్రిటీష్‌ సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టిన క్విట్‌ ఇండియా స్ఫూర్తితో నరేంద్ర మోడీ నిర్భంధాలను ప్రతిఘటించాలని, కార్పొరేట్‌ శక్తుల నుంచి దేశ సంపదను కాపాడుకోవాలని నేతలు  పిలుపునిచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)